కరోనా భారీన పడిన బిగ్‌బీ అమితాబచ్చన్ ఆయన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కొవిడ్19 పాజిటివ్ లక్షణాలున్నట్లు గుర్తించిన అమితాబ్, అబిషేక్‌బచ్చన్‌లో నానావతి ఆసుపత్రిలో చికత్స పొందుతున్నారు. కుటుంబంలోని అందరూ వైరస్‌కు గురైనట్టు సమాచారం ఇచ్చారు. గత 10 రోజుల్లో తనను కలసిన వారంతా వైద్యపరీక్షలు చేయించుకోవాలని అమితాబ్ స్వయంగా సూచించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ చెప్పారు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని.. అమితాబ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు స్పష్టంచేశారు. అమితాబ్ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ట్వీట్ల సందేశం పంపారు.