కరోనా వచ్చినా.. తగ్గినా.. వస్తుందనే ఆలోచన వచ్చినా వెన్నులో వణకు పుడుతుంది. చిన్న.. పెద్ద అని తేడాలేకుండా మరీ గుప్పెళ్ల కొద్దీ విటమిన్ల మాత్రలు తెగ మింగేస్తున్నారు. గ్లాసుల కొద్దీ కషాయాలు గొంతులో పోస్తున్నారు. అసలు కరోనా వైరస్ ఇలా వస్తుందనేందుకు ఖచ్చితమైన ఆధారాల్లేవు. కనీసం.. తగ్గినట్టేనా! మున్ముందు రాదనేందుకు ఆధారాల్లేవు. శాస్త్రవేత్తలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. రష్యా తొలి వ్యాక్సిన్ తెచ్చి ఆనందాన్ని తెచ్చినా.. వైరస్ ముప్పు ఏ రూపంలో ఎటువైపు నుంచి దాడిచేస్తుందనేదానిపై ఇప్పటికీ బోలెడు పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా అమెరికన్ కొత్త విషయం గుర్తించారు. చికోగో ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు అంటే దాదాపు 62 ఏళ్లుండే వ్యక్తికి దాదాపు నాలుగైదు రోజులుగా వెక్కిళ్లు వస్తున్నాయట. కాస్త జ్వరంగా కూడా ఉందట. అంతే తప్ప మరే లక్షణాలు లేవు. అయితే.. ఎందుకీ వెక్కిళ్లు వస్తున్నాయని వైద్యపరీక్ష చేసిన వారికి దిమ్మతిరిగే విషయం తేలిందట. అప్పటికే వృద్ధుడిలో ఊపిరితిత్తులు వాచిపోయాయి. ఓ వైపు రక్తస్రావం కూడా రావటాన్ని గుర్తించారు. ఈ లెక్కన. వెక్కిళ్లు కూడా కరోనా లక్షణాల్లో ఒకటేనని తేల్చారు. కాబట్టి.. ఇక నుంచి జ్వరం, దగ్గు, జలుబు, వాసన, రుచి కోల్పోవటమే కాదండోయ్.. ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నా ఒక్కసారి వైద్యుల వద్దకు వెళ్లాల్సిందేనంటూ సూచిస్తున్నారు.



