మెగాస్టార్ సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో రెండు వరుస సూపర్ డూపర్ హిట్లతో బాస ఈజ్ బ్యాక్‌గానే కాదు.. అన్నయ్యలో ఈజ్ అలాగే ఉందనుకుంటున్నారు. ఈ తరం కుర్ర హీరోలు కూడా మెగాస్టార్ చిరంజీవిని మరింత స్పూర్తిగా తీసుకుంటున్నారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆచార్య షూటింగ్ దాదాపు 50శాతం వరకూ పూర్తయింది. కరోనా పుణ్యమాంటూ వాయిదా పడకపోతే ఇప్పటికే సినిమా పూర్తయ్యేది. సంక్రాంతి బరిలో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేది. అయితే.. ఇంతటి అంచనాలున్న సినిమా కోసం రూ.20 కోట్లతో భారీసెట్ ఏర్పాటు చేస్తున్నారట. కేరళ నేపథ్యంలో గ్రామాన్ని రూపొందించేందుకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుచేస్తున్నారట. డైరెక్టర్ శివ కూడా మెగా సినిమాపై భారీ ఆశలు పెంచుకున్నారు. గత సినిమాలను మించిన ఏకాగ్రత దీనిపై ఉంచుతున్నారు. అన్నయ్య సినిమా ఎంతటి హిట్ కొడితే.. డైరెక్టర్‌గా తాను అంతగా ఎదుగుతాననేది కొరటాల కోరికట.



