అందంగా గడిపిన బాల్యం.. అంతకు మించిన సౌందర్యరాశిగా గుర్తింపు. కానీ.. వయసులోకి వచ్చాక ఎన్నో దెబ్బలు చవిచూసింది. పేరుప్రఖ్యాతలు. సిరిసంపదల కాళ్లముందుకు చేరిన సమయంలో 31 ఏళ్ల వయసుకే.. ఈ మోసాలు.. మాయలతో జీవించలేనంటూ తనువుచాలించారు. అద్దాలమేడలో జిలుగులు మాత్రమే గుర్తించిన ఆమె అందరి హీరోయిన్లు మాదిరిగానే ఎదురుదెబ్బలు తిని.. బతుకుచాలించింది. ఆర్తీఆగర్వాల్… నువ్వునాకునచ్చావ్‌తో తెలుగు ప్రేక్షకుల మనసుదోచింది. కొద్దిసమయంలోనే అగ్రహీరోల సరసన నటించి ఔరా అంటూ మెప్పించింది. అమెరికాలో లోని న్యూజెర్సీలో పుట్టారు ఆర్తిజ తండ్రి కౌశిక్ అగర్వాల్, తల్లి వీమా అగర్వాల్. స్వస్థలం గుజరాత్ అయినా వ్యాపార నిమిత్తమ అగ్రదేశం వెళ్లారు. ఫిలడెల్ఫియాలో జరిగిన ఒక నృత్యప్రదర్శనకు హీరో సునీల్‌శెట్టి వెళ్లారు. ఆ ప్రదర్శనలో ఆర్తిఅగర్వాల్ అద్భుతమైన నృత్యంతో అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమితాబ్ కూడా వెళ్లారు. ఆర్తి అభినయం చూసిన అమితాబ్.. సినిమాల్లోకి వస్తే బావుటుందంటూ ఆర్తీ తల్లిదండ్రులకు సూచించారు. అప్పటికి ఆర్తీ వయసు కేవలం 14 మాత్రమే. అలా మోడలింగ్ నుంచి వెండితెర వైపు అడుగులు పడ్డాయి. ముంబయి వచ్చిన ఆర్తీ నట శిక్షణాలయంలో చేరి శిక్షణ పొందింది. బాలీవుడ్‌లో పాగల్‌పాన్ సినిమా ద్వారా నటిగా పరిచయం. ఆ తరువాత నువ్వునాకునచ్చావ్‌లో నందినిగా అలరించారు. నాలుగైదేళ్ల వ్యవదిలోనే ఇంద్ర, వసంతం, పల్నాటిబ్రహ్మనాయుడు.. పెద్ద హీరోలతో నటిస్తూనే..జూనియర్‌తో అల్లరిరాముడు, ప్రభాస్‌తో అడవిరాముడు, సునీల్‌తో అందాలరాముడులోను నటించారు. 2005 మార్చిలో ఆమె ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. తరుణ్‌తో తనకు సంబందం ఉన్నట్టు వస్తున్న పుకార్లతో విరక్తి చెంది ఇలా చేసినట్టు పోలీసు విచారణలో వెల్లడించారు. 2006లో ఇంట్లోని మెట్లమీద నుంచి కిందపడి గాయాలపాలయ్యారు. 2007లో ఉజ్వల్‌నిమక్ అనే వ్యాపారిని పెళ్లిచేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అమెరికా వెళ్లారు. అధికబరువుతో బాధపడుతూ తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. సినిమా అవకాశాలు తగ్గటంతో అతిథి పాత్రలు కూడా చేయాల్సి వచ్చింది. అలా మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఎలాగైనా బరువును అదుపులోకి తెచ్చుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నారు. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్నారు. కానీ
చికిత్స వికటించటంతో జూన్ 6వ తేదీ 2015న ఎగ్ హార్బర్ టౌన్ షిప్ లోని తన స్వగృహంలో కనుమూశారు. నాటి ఫటాఫట్ జయలక్ష్మి నుంచి జయలలిత, దివ్యభారతి, సిల్క్‌స్మిత వంటి తారల మరణాల వెనుక కారణాలు గోప్యంగా ఉన్నట్టుగానే.. ఆర్తీఅగర్వాల్ మరణం కూడా.. అధికబరువు కోటాలో కొట్టుకుపోయింది.