ఒక కానిస్టేబుల్ కొడుకు స్వయంకృషితో ఎదిగాడు. మెగాస్టార్ అయ్యాడు. ప్రతి ఆగస్టు 22న సినీ పెద్దలు, నటులు అందరూ చిరంజీవి గురించి చేసే ప్రశంసలు. ప్రజారాజ్యం పెట్టినపుడు కూడా ఆయన ఏమైనా ఎన్టీఆర్ అనుకుంటున్నారా ! అన్నారు. కానీ.. అటువంటి సున్నితమనస్కుడు రాజకీయాల్లో ఇమడలేడన్నారు. వాస్తవానికి 1983 నాటికి కాంగ్రెస్ అంటే విరక్తితో ఉన్నారు తెలుగు ప్రజలు. 2009 నాడు. అదే కాంగ్రెస్ అంటే.. ముఖ్యంగా వైఎస్సార్ అంటే చాలా అభిమానంతో ఉన్నారు. దీంతో ఫలితాలు తారుమారయ్యాయి. ఆ తరువాత సినీ, రాజకీయ వర్గాలు చిరంజీవి పార్టీను అమ్మేశాడంటూ ప్రచారం. తెలుగు తెరపై వెంకట రాఘవాపురం నుంచి ఏ ఎన్నార్, నిమ్మకూరు నుంచి ఎన్టీఆర్, బుర్రిపాలెం నుంచి కృష్ణ ఇలా ఎంతోమంది కమ్మ సామాజికవర్గం నుంచి స్టార్‌లుగా ఎదిగారు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే కుర్రాడు బీకాం పూర్తిచేసి మద్రాస్ చెక్కేశాడు. చిన్న వేషాల నుంచి మెగాస్టార్‌గా ఎదిగాడు. ఆ క్రమంలో తాను పడిన కష్టాన్ని సినీరంగం ప్రశంసిస్తూనే ఉంటుంది. కానీ.. వీలు చిక్కినప్పుడల్లా ఈటెల్లా.. పొడిచేందుకు సిద్ధంగా ఉంటుంది. అనుకూల మీడియా.. వ్యతిరేక వర్గాలు రంగప్రవేశం చేసి చిరు చేసే ప్రతిపనిలో ఏదో ఒక లోపాన్ని వెతికేపనిలో ఉంటూనే వస్తున్నారు. ఇప్పుడు బాలయ్య రూపంలో మరో సారి మెగాస్టార్ చుట్టూ విషప్రచారం షురూ అయింది. ఎంతోమంది మహామహులు వందేళ్ల కాలంలో తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేశారు. ఎదురుదెబ్బలు తిన్నారు. పరభాషల నుంచి పరాభవాలు చవిచూశారు. కానీ.. అంతర్గతంగా కుల, వర్గ బేధాలు మాత్రం తెలుగు కళామతల్లి కళ్లవెంట కన్నీరు తెప్పిస్తూనే ఉంటాయి. మా అనే అసొసియేషన్‌లో తరచూ జరిగే గొడవలు సిని తెర వెనుక ఉన్న అసలు రంగులు జనాలకు చూపుతుంటాయి. శ్రీరెడ్డి వంటి నటి బయటకు వచ్చి చేసే కామెంట్స్ కళారంగాన్ని మరింతగా అప్రతిష్టపాల్జేస్తుంటాయి. నాలుగేళ్ల క్రితం.. సినీరంగంలో డ్రగ్స్ గొడవ ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఎక్సయిజ్ శాఖ అధికారులు రవితేజ, పూరీజగన్నాథ్, చార్మి, ముమైత్‌ఖాన్ వంటి నటీనటులను పిలిచి. గోళ్లు.. వెంట్రుకలు సేకరించి పంపారటంటే.. వెండితెర వెలుగుల వెనుక చీకటి బాగోతులు అర్ధమవుతున్నాయి. అప్పట్లో చిరంజీవిని లెజెండ్ యాక్టర్ అంటూ స్వర్ణోత్సవ సభలో ప్రశంసిస్తే.. ది గ్రేట్ మోహన్‌బాబు భరించలేకపోయాడు. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలుస్తారా అంటే.. నేనెవర్నీ నెత్తికి ఎక్కించుకోనంటూ బాలకృష్ణ చిందులేశాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు ఏకంగా మా బ్లడ్‌లో బ్రీడ్‌లో మాత్రమే ఆ దమ్ము ఉందంటూ చిరంజీవిని ఎగతాళి చేశారు. మొన్నీ మధ్య మా సమావేశంలోనూ డాక్టర్ రాజశేఖర్ కూడా చిరంజీవి పట్ల ఎలా వ్యవహరించారనేది తెలుస్తుంది. ఇంతకీ చిరంజీవి చేసిన తప్పేమిటీ… మెగా కుటుంబంలో హీరోలు, నిర్మాతలు ఉండటమేనా! అంటూ చిరు అభిమానులు ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?