బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ లంగ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది పడుతూ లీలావతి ఆసుపత్రిలో చేరారు. వైద్యపరీక్షల్లో కొవిడ్ నెగిటివ్‌గా తేల్చారు. మరోసారి వైద్యపరీక్షలు చేసిన వైద్యులు లంగ్‌క్యాన్సర్‌గా నిర్ధారించారు. ప్రాథమిక చికిత్స అనంతరం.. సంజయ్‌దత్ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. సంజయ్‌దత్ క్యాన్సర్ బారీనపడినట్టు తెలియగానే.. రాజకీయ, సినీ, క్రీడారంగాలకు చెందిన ప్రముఖులు ఆయన్ను పరామర్శించారు.