అమెరికా భారత్- చైనా వివాద అంశంలో భారత్ కి తన మద్దతును ప్రకటిస్తూనే వుంది. వాషింగ్టన్ లో జరిగిన అమెరికా ప్రతినిధుల సమావేశం లో భారత్ చైనా బోర్డర్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతను శాంతియుతం గా పరిష్కరించాలని అమెరికా చైనాను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
చైనా సైనిక చొరబాట్లకు వ్యతిరేకంగా భారత్ కి అమెరికా మద్దతు ఉంటుందని అమెరికా చట్టసభ పునరుద్గాటించింది. గతంలో ఘర్షణలలో జరిగిన ప్రాణ నష్టాన్ని సభలో ప్రస్తావించారు. భూటాన్, తైవాన్, హాంకాంగ్ విషయాల్లో కూడా చైనా తీరును తప్పుపట్టారు