జగన్ సార్ జరభద్రం!

పార్టీ నేతల నుంచే రక్షణ లేకుండా పోయిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటున్నారు . తన ఫిర్యాదు మేరకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం పరిశీలించి వై భద్రత కల్పించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలియచేసారు . కొద్ది రోజుల్లో భద్రత వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో మహిళా రైతులు హైవేపై గాంధేయవాదంలో నిరసన తెలిపితే.. కుక్కలతో పోల్చారని, ఇది చాలా దారుణమన్నారు. ‘ముఖ్యమంత్రిగారు వారు వేటకుక్కలై వేటాడే సమయం దగ్గరపడే రోజు వస్తుందని’ అన్నారు. ఇలాంటి పోస్టింగులు పెట్టినవారిపై కఠినచర్యలు తీసుకోవాలని రాఘురామ కోరారు.

రంగనాయకమ్మ అనే వృద్ధ మహిళ ఎవరో పెట్టిన పోస్టింగ్‌ను ఫార్వర్డ్ చేస్తే ఆమెపై కేసులు పెట్టినప్పుడు… ఇటువంటి వాళ్లపై కేసులు పెట్టకపోతే అపార్థం చేసుకోవాల్సి వస్తుందని సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎస్వీబీసీ ఛానెల్‌లో రామమందిర శంకుస్థాపనను ప్రసారం చేయకపోవడం దారుణమని రాఘురామ అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌పై అభిమానం ఉంటే మరోవిధంగా చాటుకోవాలిగానీ గుడి కడతానని గోపాలపురం ఎమ్మెల్యే అనడం సిగ్గుచేటన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు. త్వరలో అమరావతిలో “మనోధైర్య” యాత్ర చేస్తానని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. కాగా ఏపీ రాజధాని అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. అయితే అమరావతికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. అభద్రతా భావానికి గురికావాల్సిన అవసరం లేదని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.

Previous articleజక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి
Next articleచిరంజీవితో సోము క‌ల‌యిక.. రాజ‌కీయ కాక‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here