ఈరోజు పోచంపల్లిలో 25 కిలోల బియ్యం, 5 కిలోల కందిపప్పు మరియు ఒక కిలో మంచి నూనె చొప్పున 40 మంది నిరుపేద చేనేత కళాకారులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గారు పంచి పెట్టారు. ప్రతిసారి చేనేతకు మద్దతు తెలుపుతూ ఈరోజు అవసరైమైన వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ చేసినందుకు అనసూయ భరద్వాజ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేనేత దినోత్సవ రూపకర్త, అఖిల భారత పద్మశాలి సంఘం, చేనేత విభాగం జాతీయ చైర్మన్ యర్రమాద వెంకన్న నేత గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి సంఘం కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ గ్రేటర్ హైదరాబాద్ యువజన సంఘం అధ్యక్షుడు గుర్రం శ్రవణ్ , పట్నం కృష్ణకుమార్ మరియు చిప్పవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.