ఒక్క ఎంపీ సీటుతో పార్లమెంట్‌లో అడుగుపెట్టిన వాజ్‌పేయి.. ఆ తరువాత కాల ప్రవాహంలో ప్రధానమంత్రిగా ఎదిగారు. ఒక చాయ్‌వాలా నరేంద్రమోదీ.. సీఎంగా.. ఆ తరువాత రెండు సార్లు పీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయస్థాయిలో రాజనీతి.. శత్రుదేశాలతో రణనీతి రెండింటినీ ఏకకాలంలో సమన్వయం చేయగలుగుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నాన్చుతూ వస్తున్న వివాదాస్పదమైన అంశాలకు పరిష్కారం చూపి దార్శనికుడయ్యారు నరేంద్రమోదీ. పాలనలో కొన్ని తప్పులు.. కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం నరేంద్రుడి వైఫల్యాలను చూపుతున్నా.. అవన్నీ మోదీ విజయాల ముందు చిన్నవిగా మారాయి. బలమైన నేతగా మోదీ ఎదుగుదలకు కారణం.. హిందుత్వ నినాదం. ఇదే ఫార్ములాను ఏపీ , తెలంగాణల్లో విస్తరించటం ద్వారా బీజేపీ అధికారం చేపట్టాలని పావులు కదుపుతోంది. ఉత్తరాధిన విజయం సాధించినట్టుగా ఇక్కడ హిందుత్వం సఫలం కాదంటూ వాదించేవారూ లేకపోలేదు. కానీ.. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెరాస అధికారం చేపట్టింది. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు కోల్పోయింది. వాటిలో నిజామాబాద్, కరీంనగర్ కూడా ఉన్నాయి. టీఆర్ ఎస్‌కు బలమైన కేడర్ ఉన్న ఆ రెండుచోట్ల ఓటమికి ప్రధాన కారణం టీఆర్ ఎస్ వ్యతిరేకత ఒక్కటే కాదు. హిందుత్వ ఎజెండా బాగా పనిచేసింది. అంతకుముందు కేసీఆర్ ఓ బహిరంగ సభలో చేసిన అనుచితమైన వ్యాఖ్య కూడా హిందువులను ఏకతాటిపైకి తీసుకువచ్చింది. దాని ఫలితమే అదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీ సీట్లను గెలుచుకుంది.
2024 నాటికి ఇదే ఫార్ములానూ ఏపీ, తెలంగాణల్లో హిందువులను ఏకం చేసేందుకు బీజేపీ ఉపయోగించనుందనే వాదన లేకపోలేదు. ఏపీలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలన సంగతి ఎలా ఉన్నా హిందువుల విషయంలో ప్రతికూలంగా ఉన్నారనే విమర్శలూ లేకపోలేదు. తిరుపతి ఆలయభూముల విక్రయం, అయోధ్యలో రామమందిర భూమిపూజను టీటీడీ ఆధ్వర్యంలోనే
టీవీ ఛానల్‌లో లైవ్ ఇవ్వకపోవటం.. వంటి పలు కారణాలను బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. తెలంగాణలో టీఆర్ ఎస్ తన మిత్రపక్షం ఎంఐఎం చెప్పినట్టుగా స్పందిస్తుందనే అంశపై బీజేపీ పలుమార్లు ఘాటుగా విమర్శిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల తప్పులను వేలెత్తిచూపేందుకు ఆర్ ఎస్ ఎస్ నుంచి వచ్చిన బండి సంజయ్, సోము వీర్రాజులకు అధ్యక్షపీఠాలను కట్టబెట్టారు. అదే వేగంతో ఉత్తరాధి రాజకీయాన్ని దక్షిణాధిన ప్రయోగిస్తూ.. రాబోయే నాలుగేళ్లలో హిందు నినాదంతో బీజేపీ బలమైన శక్తిగా ఎదగాలని ప్లాన్ చేస్తోంది. అది ఎంత వరకూ విజయం సాధిస్తుందనేది కాలమే నిర్ణయించాలి.
Chakkani Vaarthalu, vivaramuga andistunna meku Aneka Aneka Dhanyawadamulu…
Expecting same quality in news in future too.
Namaskaram..
Thanks for your apriciation, sure we give good article s further,
Pls like our facebook page
http://www.facebook.com/kadhalika.in