దేవరకొండ విజయ్… మాటలోనే కాదు. . మనసు కూడా చల్లనే అని చాటుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి దూరమైన వేలాది కుటుంబాల ఆకలి తీర్చాడు. జూన్ 2వ తేదీ వరకూ నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహించాడు. కరోనా రక్కసి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి లేక కుటుంబాలన్నీ ఇళ్లకే పరిమితమ కావాల్సి వచ్చింది. ఆకలి వేసినా ఆత్మాభిమానంతో నోరు మెదపలేని మద్యతరగతి కుటుంబాల బాధను గుర్తించిన దేవరకొండ విజయ్ స్థాపించిన దేవరకొండ ఫౌండేషన్.. మిడిల్ క్లాస్ ఫండ్ అనే ఇనీషియేటివ్ ను ప్రారంభించి మధ్యతరగతి వారికి అండగా నిలిచింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ ఫౌండేషన్ కార్యకలాపాల్లో అనునిత్యం యాక్టివ్ గా ఉంటుండడం గమనార్హం. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా 17,723 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. దీనికోసం .7 కోట్ల రూపాయల ఖర్చు చేశారట. ఈ ఫౌండేషన్ ద్వారా 58,808 కుటుంబాలకు సమయానికి సహాయం అందగా, 8,505 వాలంటీర్లు ద్వారా 1.5 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. సంకట సమయంలో తన బాధ్యతను చాటుకున్నాడు. విజయ్ ను చూసి స్పూర్తి పొందిన చాలామంది ఫండ్స్ రూపంలో ఫౌండేషన్ కు అండగా నిలిచారు. దేవరకొండ ఫౌండేషన్ కు సహాయం కోసం అర్జీ పెట్టుకొన్న ప్రతి ఒక్కరి ప్రొఫైల్ ను చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి మరీ సహాయం అందించడం ద్వారా పెట్టుబడిని వేస్ట్ చేయకుండా ఫండ్స్ & డొనేషన్స్ ద్వారానే అవసరార్థులకు సహాయం అందించడం విశేషం. ఫౌండేషన్ అభ్యర్ధన మేరకు కార్పొరేట్ సంస్థలకు చెందిన 535 మంది వాలంటరీగా సహాయం చేయడానికి ముందుకొచ్చి కష్టకాలంలో వేల కుటుంబాలకు బాసటగా నిలిచారు.