పెళ్లికి ర‌మ్మంటున్న నితిన్‌!

సినీన‌టుడు నితిన్ , షాలినీల వివాహం ఈ నెల 26న హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. జ‌యం సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన నితిన్ ఆ త‌రువాత వ‌రుస‌గా ఏడు ప్లాప్‌లు చ‌విచూశాడు. అయినా.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానిగా అదే ధైర్యంతో వ‌రుస‌గా సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు. బ్యాచిల‌ర్ జీవితానికి స్వ‌స్తిచెప్పి పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడు. త‌న వివాహ మ‌హోత్స‌వానికి ర‌మ్మంటూ ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌ల‌సి శుభ‌లేఖ అంద‌జేశారు. త‌రువాత ఏపీ సీఎం జ‌గ‌న్‌, ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల‌కూ ఆహ్వాన‌ప‌త్రిక‌లు పంచ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here