ఒక్కో సైనికుడు.. 20 మంది శత్రు సైనికులకు సమాదానం చెప్పగలడు. యుద్ధట్యాంకులు. శతఘ్నులను మించి దైర్యం కేవలం భారతీయ సైనికుల సొంతం.
1971లో పాకిస్తాన్‌తో యుద్ధం తరువాత 93,000 పాక్‌సైనికులు భారత్‌కు లొంగిపోయారు. అదీ మన వాళ్ల సాహసానికి ఒక ఉదాహరణ. అందరికీ క్షమాబిక్ష తో వదిలేయటం మన భారతీయత. అమెరికా వద్ద ఉన్న ఆయుధాలు.. బారత సైనికులను తనకిస్తే ప్రపంచాన్ని జయిస్తానంటూ ఓ సైనికాధికారి అన్నట్టు ప్రచారం జరిగింది. ఇది నిజమే అనేందుకు చైనా, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు నిలువుటద్దం. 1962లో శాంతిమంత్రం జపిస్తూనే చైనా పన్నాగం భారతీయుల నమ్మకాన్ని వమ్ముచేసింది. ఫలితంగా పరాజితులుగా ముద్రపడింది. కానీ ఇది 2020 ప్రపంచవ్యాప్తంగా ఆధునాతన యుద్ద సన్నద్థత, వార్ ఫీల్డ్‌లోనూ మాకు మేమే చాటి అనుకుంటున్నాం. ఇది మన మాటే కాదు.. 2020 సంవత్సరంలో గ్లోబల్ ఫైర్ పవర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయంగా 136 దేశాల ఆర్మీపవర్‌ను లెక్కగట్టింది. వాయు, జల, భూమార్గాల్లో ఆయా దేశాల సత్తాను ప్రకటించింది. చైనా, పాకిస్తాన్‌తో యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలో.. ఇది ప్రతి భారతీయుడుకి ఇండియన్ ఆర్మీ దమ్ము ఏపాటిదో తెలుసుకునే వీలుంది. సైనిక సత్తాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. అమెరికా, రష్యా, చైనా, భారతదేశం.. వరుసగా ఉన్నాయి. ఇండియా పేరెత్తితే కయ్యానికి కాలుదువ్వే పాక్‌ది 15వ స్థానం. అమెరికా 22,60,000, రష్యా 30,13,628, చైనా 26,93,000, ఇండియా 35,44,000 సైన్యం ఉంది. పాకిస్తాన్ సైనికులు కేవలం12,04,000 మంది మాత్రమేనట. ఆయుధపరంగా ఎయిర్‌ఫోర్స్, నేవి బలగాల్లో చైనాకు ధీటుగానే ఉన్నా పాకిస్తాన్‌కు అందనంత ఎత్తులో ఉన్నాం. ఆర్టిలరీ విభాగంలో ప్రపంచంలో ఇండియానే నెంబర్ టూ శతఘ్నులు రష్యా మొదటిస్థానంలో 4465 ఉన్నాయి. ఇండియా వద్ద 4060, చైనా వద్ద 3600, పాక్ వద్ద 1160 ఉన్నాయి. భూ మార్గంలో ఇండియా సరిహద్దులను జయించటం రెండు దేశాలకూ సవాల్. ఎయిర్‌ఫోర్స్ ఇండియా 2123, చైనా 3210, పాక్ 1372 ఉన్నాయి. వీటిలో ఫైటర్స్ ఇండియా వద్ద 538, చైనా వద్ద1232, పాక్ 356 ఉన్నాయి. యుద్ధట్యాంకుల్లోనూ మనమే టాప్. మన వద్ద 4292 ట్యాంకులుంటే. చైనా వద్ద 3500, పాక్ వద్ద 1000 వరకూ ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. జలమార్గంలో సబ్‌మెరైన్లు మన వద్ద 16 ఉన్నాయి. పాక్ వద్ద 08, చైనా వద్ద 74 ఉన్నాయి. అమెరికా భారత్ వైపు మొగ్గు చూపటం, ఇజ్రాయేల్, ఫ్రాన్స్ వంటి ఆయుధ సంపత్తి గల దేశాలు భారత్‌కు బాసటగా ఉండటం.. చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయుధాలెన్ని ఉన్నా.. ఇండియన్ ఆర్మీ ప్రదర్శించే దైర్యసాహసాలు.. 12000 అడుగుల ఎత్తులో యుద్ధభూమిలో పొందిన శిక్షణ.. ఇవన్నీ శత్రుదేశాల వెన్నులో వణకు పుట్టిస్తున్నాయి.