చంద్రబాబు రాకతో విశాఖలో రాజకీయ కాక మొదలైంది.. వైసీపీ ఏడాది పాలన పూర్తయిన సమయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల అక్కడ ఎల్జీ పాలిమర్‌లో విషవాయువు 12 మంది ప్రాణాలు తీసింది. 500 మందిని ఆసుపత్రి పాల్జేసింది. స్టైరిన్ విషవాయువు ప్రభావం కొన్ని తరాల పాటు వెంటాడుతూనే ఉంటుందనే శాస్త్రవేత్తల ఆందోళన కలవరపాటుకు గురిచేస్తుంది. ఎల్జీ పాల్జిమర్స్ కంపెనీకు ఎప్పుడు వచ్చింది. ఎవరు అనుమతినిచ్చారు అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 1998లోనే దీనికి చంద్రబాబు ఊపిరి పోశారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది జనావాసాల మధ్య ఉండ కూడదనే విమర్శలు వచ్చినా బాబు గారు మాత్రం పచ్చజెండా ఊపారట. సర్లే అది గతం.. 2019లో దీనికి మరోసారి అనుమతిచ్చిన ఘనత మాత్రం వైసీపీ దట. పైగా దానిలోని ఉన్నతాధికారి ఎవరో రెడ్డిగారికి దగ్గర బంధువు అంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇదిలా ఉంటే.. అసలు ఇప్పుడే అదీ లాక్‌డౌన్‌లో ఉండగా పరిశ్రమ ఎలా తెరిచారనేదానికి సమాధానం కూడా చాలా ఆసక్తిగా ఉంది. పైగా ఎవ్వరూ నిపుణులు లేకుండా కేవలం తమకు తామే నిర్ణయం తీసుకున్న ఎల్జీ ఉద్యోగి ఎవరనేది కూడా ప్రశ్నార్ధకమే సుమా! విషవాయువు బయటకు రాగానే టీడీపీ విమర్శల దాడి మొదలుపెడితే.. వైసీపీ తరపున జగన్ సీఎం హోదాలో చాలా చాకచక్యంగా బాధితులకు భారీ పరిహారం ప్రకటించి విమర్శలకు చేతలతో సమాధానమిచ్చారు. ఇది వైసీపీ కూడా బాగానే సొమ్ము చేసుకుంది. అయితే.. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే.. ఇంతకీ పరిశ్రమలో వాయువు వెదజల్లటానికి వాస్తవాలను తెలుసుకునేందుకు ఏకంగా నేషనల్ ట్రిబ్యునల్ బోర్డు, కేంద్రం రెండూ సిద్ధమయ్యాయి. కేంద్ర జోక్యం చేసుకుంటుందని జగన్ సర్కారు ఊహించినా ఇంత సీరియస్‌గా లోతుగా అధ్యయనం చేస్తారని ఊహించి ఉండదు. ఇది వైసీపీ, టీడీపీ రెండు పార్టీలకు ఊహించని షాక్‌గానే పరిశీలకు భావిస్తున్నారు. రాష్ట్రం విఢిపోయాక. ఎవరు మొదట దీనికి అనుమతి ఇచ్చారనేది కూడా తేలబోతుంది. ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు కురిపిస్తున్న సానుభూతిలో వాస్తవాలు కూడా బయటపడనున్నాయి. వైసీపీ సర్కారు పాపం కూడా ఎంత ఉందనేది కూడా తేటతెల్లం కానుందన్నమాట. ఇప్పటి వరకూ ఉరిమి చూస్తున్న కేంద్రం తమ రాజకీయ స్వలాభం కోసం వాస్తవాలను తొక్కేస్తుందా.. నిజాలను ప్రజల ముందు ఉంచుతుందా! అనేది చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.