ఫాఫం బాలయ్య తనను సమావేశానికి పిలువలేదని ఫీలయ్యాడు. ఓస్ బాలయ్య పిల్లోడు పిలిచినా ఒకటే పిలవకున్నా ఒకటే అని మెగాస్టార్ అనుకోని ఉండవచ్చు. అయినా ఇది అప్పట్లో అంటే.. టీడీపీ ఏపీలో అధికారంలో ఉన్నపుడే రాచుకున్న అగ్గి. లేపాక్షి ఉత్సవాలకు చిరంజీవిని పిలుస్తారా అంటే… అబ్బే.. ఎవర్నీ నెత్తిన పెట్టుకోను.. పిలువనంటూ ముఖానే చెప్పేశాడు. ఆ తరువాత ఎన్టీఆర్ బ్లడ్ బ్రీడ్ వేరంటూ.. చిరంజీవి రాజకీయపార్టీ ఫెయిల్యూర్‌పై నోరుజారాడు. ఆ తరువాత పవన్ రంగ ప్రవేశం.. చరణ్ కూడా ఘాటుగా సమాధానం ఇవ్వటం అన్నీ జరిగాయి. అప్పుడంటే. కేంద్రంలో పెత్తనం.. రాష్ట్రంలో అధికారంతో కన్నుమిన్ను కనపడలేదాయె. ఇప్పుడు కూడా సినీ రంగంలో ప్రముఖుల్లో బాలయ్యకూ చోటుంది. అది ఎవరూ కాదనలేనిది. కానీ.. చిరంజీవి పెద్దరికం తీసుకోవటం ఎందుకో.. నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదంతా.. కమ్మ వర్సెస్ కాపు వర్గ పోరు అనేది బయటకు చెప్పకున్నా వాస్తవం. అయినా.. ఇప్పుడు.. బాలయ్య స్పీచ్‌లో భూములు పంచుకునేందుకు జరిగిన మీటింగ్ అంటూ బాలయ్య నోరు జారటం రచ్చకు కారణమైంది. దీనిపై నాగబాబు కూడా గట్టిగా కౌంటర్ ఎటాక్ చేయటం కూడా బాలయ్య బాబు అభిమానులను కాసింత ఆవేశానికి గురిచేసింది. ఏమైనా.. అప్పట్లో అంటే.. నరేంద్రమోదీపై విజయవాడలో హిందీలో తొడకొట్టి కలకలం సృష్టించాడు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లోనూ బుల్‌బుల్ అంటూ నవ్వులు పండించాడు. నాగబాబు కూడా తక్కువ వాడేం కాదు.. అప్పుడు బాలకృష్ణ అంటే కమెడియన్ కదా అంటూ చిచ్చుపెట్టాడు. ఆ తరువాత గాడ్సే దేశభక్తుడంటూ కితాబుచ్చి బుక్కయ్యాడు. ఇప్పుడు బాలయ్య కింగ్ కాదు.. హీరో మాత్రమేనంటూ స్పష్టంచేశాడు. బాలయ్య బాలయ్యే.. నాగబాబు నాగబాబే.. ఇద్దరూ ఎవ్వరూ తగ్గరు. అలాగనీ.. ప్రతీకారం తీర్చుకునేంత సత్తా ఉందా! అంటే అబ్బే.. ఇద్దరూ పైకి గంబీరంగా కనిపించే సౌమ్యులు. కానీ.. అప్పుడపుడు ఇలా అగ్గిరాజేసి పక్కోళ్లను కొట్టుకు చావమంటూ వదిలేస్తుంటారు. మరి సినీ రచ్చ ఎప్పటికి కొలిక్కివస్తుందో.. అసలే ఆచార్య షూటింగ్ ఆగిపోయి టెన్షన్ పడుతున్న
చిరుకు ఇది కొద్దిగా చికాకే సమా!