మొబైల్ తయారీలో దిగ్గజ కంపెనీ యాపిల్ ఐపోన్‌లు తయారు చేసే పెగట్రాన్ భారత్‌లో తయారీకు సిద్ధమైంది. యాపిల్ పోన్లు తయారు చేసే విస్ట్రన్, ఫోక్సన్ కంపెనీలు ఇదివరకే ఉత్పత్తి ప్రారంభించాయి. తైవాన్‌లోని ఈ సంస్థ ఇప్పుడు చెన్నైలో పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. వాస్తవానికి అక్కడ పనిచేసే ఉద్యోగులు అధికశాతం చైనా వాళ్లే ఉంటారు. గతేడాది దీని టర్నోవర్ రూ.150కోట్ల డాలర్లు అంతటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థ ఇండియాలో పెట్టుబడులకు ముందుకు రావటం భారత్ కీర్తిని మరోసారి విశ్వవ్యాప్తం చేసినట్టయింది. ఇండియా-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు.. యుద్ధవాతావరణం నేపథ్యంలో ఈ పరిణామం చేసుకోవటం నిజంగానే భారత్ మున్ముందు అంతర్జాతీయ పెట్టుబడులకు కేరాఫ్ చిరునామాగా మారుతుందనేందుకు ఉదాహరణ.