ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. వెనుకచాటుగా ఎంతగా దెబ్బతీయాలనుకున్నా భారతదేశం శక్తి అమోఘం. అనిర్వచనీయమైన భారతీయతను ఎవ్వరూ ఏమి చేయలేరంటూ ప్రపంచదేశాలకు తెలుసు. కొవిడ్19 వ్యాప్తితో ప్రపంచమంతా హడలెత్తుతుంది. కానీ.. అంతర్జాతీయంగా చూసుకుంటే ఇండియాలోనే రికవరీ రేటు ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్ తయారీలోనూ మనమే ఒకడుగు వేగంగా నడుస్తున్నాం. ఐసీఎంఆర్-భారత్ బయోటెక్ చేపట్టిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్టు వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఇండియా ఫార్మ రంగాన్ని ప్రశంసించారు . భారత్‌బయోటెక్-ఐసీఎంఆర్ చేపట్టిన వ్యాక్సిన్ తయారీలో తమ సంస్థ బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా భాగస్వామ్యం అయినట్టు చెప్పారు. భారత్ రూపొందించే వ్యాక్సిన్ కేవలం భారతదేశానికే గాకుండా.. ప్రపంచానికి సరఫరా చేయగల సత్తా ఉందంటూ విశ్లేషించారు.