మెగాస్టార్ పుట్టినరోజంటే.. కోట్లాది మంది అభిమానులకు పండుగ. అనకాపల్లి నుంచి అమెరికా వరకూ అన్నిచోట్ల అగస్టు 22న చిరు ఫ్యాన్స్ హంగామా అదే స్థాయిలో ఉంటుంది. అన్నదానం.. రక్తదానం.. వంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. లక్షలామందికి ఉపయోగపడేలా.. అవయవదానంపై ఎంతోమంది సంతకాలు చేస్తారు. ఇదంతా ఏటా జరిగేతంటే.. ఈ సారి చిరంజీవి 65వ పుట్టినరోజు.. పైగా సైరా తరువాత ఆచార్యతో మెరవబోయే అన్నయ్యకు ఎలాంటి శుభాకాంక్షలు చెప్పాలనే దానిపై ఇప్పటికే ఎన్నోప్లాన్లు.. పైగా రికార్డు స్థాయిలో ఏదోఒకటి చేసి సంచలనం సృష్టించాలనేది కూడా మెగా అభిమానుల ప్లాన్. 65 మంది సెలబ్రిటీలతో వీడియో రికార్డ్.. ట్వీట్ల వర్షం.. అభిమానులు.. ముఖ్యంగా మహిళా అభిమానుల నుంచి కొద్దిపాటి నిడివిగల వీడియోలను చేయాలని మెగా అభిమాని మాధవి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాఫ్యాన్స్ తమ క్రియేటివిటీకు రూపమిచ్చే పనిలో పడ్డారు. చిరు కూడా తన అభిమానుల కోసం.. ఆచార్యలోని టీజర్‌ను విడుదల చేస్తారని అభిమానులు కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారండోయ్!