కరోనాతో సినీ రంగం బాగా ఇబ్బందులు పడుతుంది. హీరోల కాల్షీట్లు వృధా అవుతున్నాయి. సగటు ఉద్యోగులకు జీతాలు తగ్గించినట్టుగా కథానాయకులకు రెమ్యునురేషన్ కూడా భారీగా కోత విధించారట నిర్మాతలు. దర్శకులు కూడా నిస్సహాయంగా ఉండటం మినహా ఏం చేయలేకపోతున్నారట. ఇదిలా ఉంటే.. బాలయ్య వర్సెస్ చిరంజీవి మధ్య అంతర్గత యుద్ధం తారాస్థాయికి చేరింది. దీనికి రాజకీయం, కుల రంగు పులిమి ఎంతవరకూ తీసుకెళ్తారనే ఆందోళన లేకపోలేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబం చుట్టూ చాలా అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. చాంతాడంత జాబితా హీరోలున్న మెగా ఇంట్లో నలుగురు హీరోలు చాలా ప్రతిష్ఠాత్మక సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగు సినిమాలూ హిట్ కొట్టాల్సిన అవసరం అభిమానులకే కాదు.. ఆ హీరోలకూ ఉంది. మొదటగా చిరంజీవి ఆచార్య 152 సినిమాగా రాబోతుంది. త్రిష మధ్యలో తప్పుకుంది. కొరటాల శివతో కాస్త విబేధాలు వచ్చాయి. అయినా అడ్డంకులు అధిగమించినా కరోనా ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. రామ్‌చరణ్ మూవీ ఆర్ ఆర్ ఆర్ కూడా పాన్ ఇండియాగా చాలా అంచనాలు వున్నాయి. వకీల్‌సాబ్‌తో రెండున్నరేళ్ల తరువాత పవన్ అభిమానులను అలరించబోతున్నారు. వరుణతేజ్ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. సాయిధరమ్ తేజ్ సోలో బతుకే సో బెటర్‌తో సిద్ధమయ్యాడు. తాజాగా సిని ప్రచారంలో వేగం పెంచాడు. ఇలా ఐదుగురు హీరోలు.. అభిమానుల మనసు కొల్లగొట్టి బాక్సాఫీసును బద్దలు చేయాల్సి ఉంది. మరి ఫ్యాన్స్ అంచనాలు.. అంతర్గత వైరాలు దాటుకుని ఎలా హిట్ అందుకుంటారనేది ఆసక్తిగా మారింది.