మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూతురు నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్ జరిగింది. గత నెలలో నిహారిక తన పెళ్లి విషయాన్ని వెల్లడించింది. గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి తనయుడే చైతన్య. పెద్దల కుదిర్చిన పెళ్లిగానే మెగా కుటుంబం స్పష్టంచేసింది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో ఎటువంటి ఆర్భాటం లేకుండా. కొద్దిమంది అతిథులు సమక్షంలో ఎంగేజ్‌మెంట్ నిర్వహించారు. డిసెంబరులో వివాహ కార్యక్రమం ఉంటుందని అంచనా. మెగాస్టార్ చిరంజీవి దంపతులు,
రామచరణ్ దంపతులు.. కుటుంబ సభ్యులు వేడుకలో పాల్గొన్నారు.