కలెక్షన్ కింగ్ మోహన్‌బాబును గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. తరచూ వివాదాల్లో ఉండే మోహన్‌బాబు కొద్దికాలంగా మౌనంగానే ఉంటున్నారు. టీడీపీ పట్ల వ్యతిరేకత.. వైసీపీ అంటే అబిమానంగా మెలుగుతుంటారు. వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉండటం.. పెద్ద కోడలు కూడా అదే కుటుంబం నుంచి రావటంతో ఈ బంధం పదేళ్లుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అర్థరాత్రి నార్సింగ్ సమీపంలోని ఫామ్‌హౌస్‌కు కారు(ఏపీ31ఏఎన్0004)లో వచ్చిన వ్యక్తులు.. మోహన్‌బాబు కుటుంబ సభ్యులను బెదిరించారు. అంతుచూస్తామంటూ హెచ్చరించి వెళ్లిపోయారు. అయితే ఈ కారు విజయలక్ష్మి అనే మహిళ పేరుతో రిజిస్ట్రరై ఉంది. మోహన్‌బాబు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ మోహన్‌బాబును బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది. మంచు మనోజ్ ఇటీవల తన భార్యకు విడాకులిచ్చారు. ఈ వివాదం ఏమైనా దీనివెనుక కారణం కావచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.