వావ్ 3 సీజ‌న్ అదుర్స్ క‌దూ!

ఈటీవీ వినొదంలో వావ్ మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో ఒక‌టి! సినీ న‌టుడు సాయ‌కుమార్ యాంక‌రింగ్‌తో ఒక‌ప్పుడు అద‌ర‌గొట్టింది. ఇప్పుడు అదే వావ్ 3వ సీజ‌న్ మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైంది. నాలుగు రౌండ్లుగా జ‌రిగే షో ఆధ్యంతం ఆక‌ట్టుకుంటుంది. వినోదం.. విజ్ఞానం.. స‌ర‌దాల విందును పంచుతూ ప్రేక్ష‌కుల‌ను ఆద‌రిస్తుంద‌న‌టంలో అతిశ‌యోక్తి లేదు. ప్ర‌తి మంగ‌ళ‌వారం 9.30 గంట‌ల‌కు మొద‌ల‌య్యే ప్ర‌ద‌ర్శ‌న‌లో తొలిభాగం అగ‌స్టు 4న సీజ‌న్ 3 వ‌చ్చేసింది. తొలి ప్ర‌ద‌ర్శ‌న‌లో యాంక‌ర్ సుమ‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, గాయ‌కుడు మ‌నో, హాస్య‌న‌టుడు ధ‌న్‌రాజ్ పాల్గొన్నారు. న‌లుగురిలోనూ సెన్సాఫ్ హ్యూమ‌ర్ పాళ్లు ఎక్కువ‌గానే ఉండ‌టం షోను మ‌రింత ర‌క్తిక‌ట్టించింది. సుమ పంచ్‌లు.. మ‌నో పాట‌లు.. గ‌జ‌ల్స్‌.. అనసూయ నృత్యాలు. ధ‌నరాజ్ చ‌మ‌క్కులు అల‌రించాయి. వ‌ద‌ల‌బొమ్మాళీ అంటూ వ‌చ్చే మూడోరౌండ్ గిలిగింత‌లు పెడుతుంది కూడా. జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌తో కూడిన నాలుగో రౌండ్‌లో సాయికుమార్ అడిగే విజ్ఞాన‌దాయక ప్ర‌శ్న‌లు భ‌లేగా ఉన్నాయి. ఏమైనా ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్‌, ఢీ షోల‌కు ధీటుగా వావ్ నిజంగానే మాంచి కిక్ ఇస్తుంద‌న‌టంలో అతిశ‌యోక్తి లేదు సుమా! సాయికుమార్ స్వ‌రం మ‌రో ప్ర‌త్యేక‌త అని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here