పాటల తోటమాలిగా పేరున్న రచయిత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ . నమస్తేఅన్న సినిమాతో వెండితెరకు పాటల రచయితగా పరిచయమయ్యారు. మెగాస్టార్ నటించిన ఠాగూర్ సినిమాలో నేను సైతం పాటతో జాతీయస్థాయి అవార్డు దక్కించుకున్నారు. ఇటీవల ఆయన కు కాలేయమార్పిడి(లివర్ ట్రాన్స్‌ప్లాంట్) శస్త్రచికిత్స జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై స్పందించిన సుద్దాల.. తాను క్షేమంగా ఉన్నానంటూ వీడియో ద్వారా అభిమానులకు తెలిపారు. కాలేయమార్పిడి తరువాత తన ఆరోగ్యం కొద్దికొద్దిగా కుదుట పడుతుందన్నారు. తనపై ఇంతటి అభిమానం చూపుతున్న అభిమానుల ప్రేమాశీస్సులతో ప్రస్తుతం పాటలు కూడా రాస్తున్నట్లు చెప్పారు.