సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఎలా మరణించాడు? నిజంగానే డిఫ్రెషన్‌కు గురై ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా సైలెంట్‌గా మర్డర్ ప్లాన్ చేసి ప్రాణం తీశారా? ఇంతకీ బాలీవుడ్ యువ హీరో మరణం వెనుక ఏం దాగుంది. ఆయన్ను చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంది? ఏం ఆశించి కుర్రహీరోను బలితీసుకున్నారు. దీనికి కారణం.. డబ్బా.. కీర్తా.. అందమైన ఆడపిల్లలా? సినిమా అంటేనే అందం. ఆకర్షణ.. ఆనందం అన్నీ కలబోసిన తేనెపూసిన కత్తి. అక్కడ ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోయినా కత్తివేటుకు గురి కావాల్సిందే! సుశాంత్‌సింగ్ విషయంలోనూ అదే జరిగి ఉంటుందనే అనుమానాలున్నాయి. రోజురో మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇంకెన్ని మిస్టరీలు దాగున్నాయనేది పోలీసు, సీబీఐ, ఈడీ దర్యాప్తుల్లో వెలుగుచూడబోతున్నాయి. ఇంతకీ.. అసలు విషయానికి వస్తే ఈ ఏడాది జూన్ 14న ముంబైలోని స్వగృహంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. కొద్దికాలంగా మానిసక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. కానీ ఆ తరువాత కంగనా పెద్ద బాంబు పేల్చారు. నెపోయిజం.. ధాటికి తట్టుకోలేక సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆమె ఆరోపణలు చేశారు. క్రమంగా ఆమె వాదనను అంగీకరిస్తూ డిబేట్లు జరిగాయి. ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్‌ను అతడి ప్రియురాలు డెంగీ జ్వరానికి ఉపయోగించే మాత్రలను అధికమోతాదులో ఇచ్చినట్టుగా గుసగుసలు వినిపించాయి. అనంతరం సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు మనీ లాండరింగ్ జరిగినట్టుగా తండ్రి కేకేసింగ్ ఫిర్యాదుతో ఈడీ విచారణ చేపట్టింది. నటి రియాచక్రవర్తి ప్రమేయంపై సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కూడా కేసును ముంబైకు బదిలీ చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. సుశాంత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే వాంగ్మూల కూడా పోలీసులు సేకరించారు. ఒకరు మాజీ ప్రియురాలు. మరొకరు ఏడాది పాటు లివింగ్ రిలేషన్‌షిప్‌తో సుశాంత్‌కు దగ్గరైన నటి. ఈ ముగ్గురు మధ్య ఐదు నెలల వ్యవధిలో ఏం జరిగింది. అసలు సుశాంత్ మానసిక ఒత్తిడికి కారకులెవరు? ఆత్మహత్య చేసుకునేంతగా ఎవరు ప్రోత్సహించారు. లేకపోతే.. సుశాంత్ కు తెలియకుండానే ఏమైనా విషప్రయోగం జరిగిందా! ఇవన్నీ బయటకు రావాలంటే సీబీఐకు కేసును అప్పగించాలనే వాదన బలపడుతోంది.