స్క్రీన్ చూసే సమయం పెరుగుతున్న కారణంగా పిల్లల్లో దగ్గర చూపు విస్తృతిలో 100% పెరుగుదల, మెల్లకన్ను కేసులు ఐదు రెట్లు పెరుగుదల: డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్
• 2020లో లాక్‌డౌన్ విధించిన తర్వాత అంతర్జాతీయ పోకడలకు అనుగుణంగా 5-15 ఏళ్లలోపు భారతీయ పిల్లలలో రెట్టింపైన మయోపియా వార్షిక వృద్ధి, క్వారెంటైన్ మయోపియా అనే అపఖ్యాతిని తెచ్చుకున్న సంవత్సరం.
• కొవిడ్-19 మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో తీవ్రమైన కమిటెంట్ ఈసోట్రిఫియా వార్షిక కేసుల్లో 5 రెట్లు పెరుగుదల, ఊహించని రీతిలో హఠాత్తుగా మెల్లకన్ను విజృంభిస్తోందని గుర్తించిన డాక్టర్ అగర్వాల్స్ హాస్పిటల్స్.
Hyderabad, ఆగస్టు 18, 2021: స్క్రీన్ చూసే సమయం పెరుగుతున్నకారణంగా భారతదేశంలో పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో మయోపియా (దగ్గరి చూపు) ఏర్పడి అది విస్తరిస్తోంది. అంతే కాదు దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల చికిత్స విభాగాల గణాంకాల ప్రకారం మెల్లకన్ను సమస్య 2020 నుంచి భయంగొల్పే రీతిలో పెరుగుతోందని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ వెల్లడించింది.
“ఈ మహమ్మారి సంవత్సరంలో 5-15 ఏళ్ల వయస్సులోపు పిల్లల్లో మయోపియా వార్షిక విస్తృతిలో 100% పెరుగుదల, అలాగే మెల్ల కన్నుసమస్యల్లో ఐదు రెట్ల పెరుగుదల కనిపిస్తోందని డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ Dr. Palak Macwana, Consultant Ophthalmologist at Dr. Agarwals Eye Hospital, Telangana. 2020లో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఈ వయస్సు పిల్లల్లో మయోపియా ఏర్పడటం రెట్టింపు అయిందని, అంతర్జాతీయంగా కూడా ఇవే పోకడలు కనిపిస్తున్నాయని” అన్నారు.
పిల్లల కంటి ఆరోగ్యం, భద్రతా అవగాహన మాసం సందర్భంగా భారతదేశంలోని అతిపెద్ద నేత్ర సంరక్షణ కేంద్రాలు కలిగిన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏటా ఆగస్టులో దీన్ని నిర్వహిస్తామని తెలిపిన Dr. Palak Macwana, “ ఇటీవల మహమ్మారి కారణంగా పిల్లల్లో తీవ్రమైన కమిటెంట్ ఈసోట్రోపియా కేసుల సంఖ్యలో అనూహ్యమైన పెరుగుదల కనిపిస్తోంది. కొవిడ్-19కి ముందు మా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు 1 లేదా 2 చూసేవాళ్లం, కాని నేడు 10 కేసులకు మించి చూస్తున్నాం. అంతే కాదు మయోపియా విస్తరిస్తుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. పిల్లల్లో 100% పెరుగుదలను మేము చూస్తున్నాం” అన్నారు.
దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి “దగ్గర నుంచి పనిచేస్తుండటం”, ఇది సాధారణంగా చదవడం, రాయడం వంటి పనులతో ముడిపడి ఉంటుంది. ఫొకస్ చేస్తున్న వస్తువులు (ఉదాహరణకు పుస్తకాలు) కంటికి మధ్య దూరం 33 సెంటీమీటర్లు ఉంటుంది. వరల్డ్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ ఆప్తామాలజీ అండ్ స్ట్రాబిస్మస్ (డబ్ల్యూఎస్‌పీఓఎస్) కన్సెన్సస్ ప్రకారం దగ్గరి చూపులో స్థిరంగా దగ్గర నుంచి పని చేయడం వలన అనేక సమస్యలు తలెత్తడమే కాదు అది మెల్లకన్నుకు దారితీస్తుంది.
లాక్‌డౌన్ కారణంగా చదువులు లేదా ఇతర అవసరాల కోసం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్స్, మొబైల్ ఫోన్లు లేదా ట్యాబ్లెట్లతో దగ్గర నుంచి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది, అంతే కాదు ఇందులో మధ్య మధ్యలో విరామం తీసుకోకుండా కూడా పనిచేయాల్సి ఉంటుంది. కంటి మీద పడే ఈ ఒత్తిడి మెల్లకన్నుకు దారితీయవచ్చు. అంతేకాదు దగ్గరి చూపు ప్రభావాన్ని పెంచుతుంది. పుస్తకాలు, పేపర్ ఆధారిత మెటిరీయల్ సహ కాంతిని వెదజల్లే డిజిటల్ పరికరాలన్నీ అన్ని కూడా మయోపియా పెరుగుదలకు సమానస్థాయిలో ముప్పుగా ఉన్నాయి. కాంతిని వెదజల్లే డిజిటల్ పరికరాల కారణంగా కళ్లు పొడిబారటం, ఫొటో సెన్సిటివిటీ వంటి ఇతర సమస్యలు ఏర్పడవచ్చు.
చక్కని కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే చర్యల గురించి Dr. Palak Macwana మాట్లాడుతూ, వరల్డ్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ ఆప్తామాలజీ అండ్ స్ట్రాబిస్మస్ కన్సెన్సస్ ప్రకారం తరుచూ విరామం తీసుకొని చేసే పనులతో పోల్చితే స్థిరంగా కూర్చొని దగ్గర నుంచి పనిచేయడం వలన మయోపియా పెరిగే ప్రభావం ఎక్కువుంటుంది. “ అంటే మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ మూడు గంటలు కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ముందు గడిపే పిల్లవాడితో పోల్చితే కదలకుండా ఒక గంట సేపు సమయం గడిపిన వారిలో కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి” అని అన్నారు.
ఆన్‌లైన్ క్లాసులు తప్పనిసరి అయినప్పుడు మొబైల్ ఫోన్ల స్థానంలో పిల్లలు ల్యాప్‌టాప్స్/డెస్క్‌టాప్స్ ఉపయోగించేలా తల్లిదండ్రులు చూడాలని Dr. Palak Macwana సూచించారు. మొబైల్ ఫోన్ స్క్రీన్లతో పోల్చితే కంప్యూటర్లు, కంటికి మధ్య దూరం ఎక్కువుంటుందని వివరించారు. అంతే కాదు కుదిరితే పిల్లలు బయట ఆడుకునేలా చూడాలని, రోజుకు గంట నుంచి 2 గంటల పాటు సూర్యరశ్మి అందడం ముఖ్యమని అన్నారు. సమగ్ర ఎదుగుదల కోసం ఆరోగ్యకరమైన, చక్కని సమతుల ఆహారం అవసరమని తెలిపారు.
మయోపియాకు సంబంధించి సరికొత్త చికిత్సల గురించి Dr. Palak Macwana మాట్లాడుతూ, మయోపియా పెరుగుదలను అరికట్టేందుకు తక్కువ డోస్ ఆట్రోపిన్ ఐ డ్రాప్స్, ప్రోగ్రెసివ్ అడిషన్ లెన్సులు, మల్టీఫోకల్ స్పెక్టకల్స్, ఆర్తోకెరటాలజీ, ఆర్‌జీపీ వంటి ప్రత్యేక కాంటాక్ట్ లెన్సులు వంటివి చికిత్సా ఆప్షన్స్. కాని కమిటెంట్ ఈసోట్రోపియా వంటి తీవ్రమైన వాటిని సరిదిద్దడం సాధ్యం కాదు. ఇలాంటి కేసుల్లో రెండు కళ్లలో చూపు పునరుద్ధరించేందుకు స్ట్రాబిస్మస్ సర్జరీ తప్పనిసరి.
భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల్లో దగ్గరి చూపు సమస్య ఏర్పడుతోందని, దాన్ని చక్కదిద్దేందుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. దగ్గరి చూపు సమస్య తీవ్రమైతే దాని కారణంగా క్యాటరాక్ట్ త్వరగా రావచ్చు. అంతే కాదు ఒపెన్-యాంగిల్ గ్లాకోమా, రెటినల్ డిటాచ్‌మెంట్, ఆట్రోఫిక్ మయోపిక్ మ్యాకులోపతి, మయోపిక్ స్ట్రాబిస్మస్ ఫిక్సస్ వంటివి ఏర్పడే ముప్పు ఉంటుంది. మయోపియా పెరగడం వలన వ్యక్తికే కాదు దేశానికి కూడా ఆర్థికంగా భారమవుతుంది.