2020 బాబోయ్.. 2020 ఐపీఎల్ మ్యాచ్ ఆడేసుకుంది. స్టేడియంలో చూడాల్సిన క్రికెట్‌ను ఇంట్లో టీవీల ముందు కూర్చుని ఆస్వాదించాల్సి వచ్చింది. అంతగా కరోనా ప్రభావం చూపింది. ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది కొవిడ్ 19 పాజిటివ్ తో మరణించారు. మరి 2021 ఎలా ఉండబోతుంది.. వ్యాక్సిన్ వచ్చి.. అందరూ హాయిగా ఉండవచ్చనుకుంటున్నారు. కానీ.. రాబోయే కొత్త ఏడాది ఇలా ఉండదట ఇంతకంటే.. చాలా దారుణంగా ఉండబోతుందంట. ఇది ఆషామాషీగా అంటున్నమాట కాదు.. ప్రపంచ భవిష్యత్ గురించి ఏనాడో చెప్పిన కాలజ్ఞాని నోస్ట్రడామస్ చేసిన హెచ్చరిక. ఇప్పుడు ఇదే టాపిక్.. మరో 18 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్న వేళ.. ఈ వార్త ప్రపంచాన్ని నిజంగానే భయపెడుతోందన్నమాటే.
తెలుగునేలపై పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం ఎంతగా నమ్ముతారో.. ప్రపంచవ్యాప్తంగా ఫ్రెంచ్ తత్వవేత్త నోస్ట్రడామస్ చెప్పిన భవిష్యవాణిపై అంతగా విశ్వాసం చూపుతుంటారు. ఆస్తికులు, నాస్తికులు అంటూ తేడాలేకుండా అధికశాతం దీన్నే నమ్ముతుండటమే ఇందుకు నిదర్శనం. 400 ఏళ్ల కిందటే.. కవితల రూపంలో భవిష్యత్ గురించి పూసగుచ్చినట్టుగా వివరించారీ తత్వవేత్త. అవన్నీ ఎలా తెలుసంటే.. కాలగమనానికి గ్రహ, నక్షత్రాల కదలికలే ఉదాహరణలు. వాటి గమనాన్ని.. మార్పులను అధ్యయనం చేస్తూ.. రేపటి గురించి అద్భుతంగా చెప్పారాయన. అవన్నీ ఇప్పటి వరకూ నిజమవుతూనే వస్తున్నాయి. 1945లో జపాన్‌పై అణుబాంబు నుంచి 2020 కరోనా వైరస్ వరకూ అన్నీ ఆయన చెప్పినవే.
2021 ఏం జరుగబోతుందంటే.. బయోవెపన్‌తో యుద్ధం జరుగుతుంది. మే 6న తోకచుక్క భూమిని ఢీకొట్టడమో.. దగ్గరగా రావటమో జరుగుతుంది. అదే సంభవిస్తే.. హిరోషిమా మీద వేసిన అణుబాంబు కంటే.. వేల కొద్దీ రెట్ల ప్రభావంతో భూమిపై తుపాన్లు, సునామీలు, భూకంపాల వంటివి సంభవిస్తాయట. ఇప్పటికే నాసా కూడా.. ఈ ఏడాది సౌర తుపాన్లు, తోకచుక్క నుంచి రాబోతున్న ముప్పుపై అంచనాలు వేసింది. నాసా కూడా నోస్ట్రడామస్ చెప్పిన మాటలను నిజమని అంగీకరించటంతో ప్రపంచవ్యాప్తంగా మరింత భయం అలుముకుంది. భూకంప తీవ్రత వల్ల పెద్దెపెద్ద నగరాలు దెబ్బతింటాయనే మాట ఇప్పుడు అంతర్జాతీయంగా వణికిస్తున్న అంశం. ఇదంతా నిజమవుతుందా! అంటే.. గతాన్ని చూస్తే నిజమే అనిపిస్తుంది. అన్నీ జరుగుతాయా! అంటే. ఏమో కాలమే నిర్ణయించాలనే ఫిలాసఫీ కూడా కనిపిస్తోంది. ఏమైనా.. 2021 ప్రపంచానికి కొత్త సవాల్ విసురుతోంది.



