ఎఫ్2.. గతేడాది సంక్రాంతి పండుగకు నవ్వులు కురిపించిన సినిమా. దగ్గుబాటి వెంకటేష్, కొణిదెల వరుణ్‌తేజ్ అద్భుతంగా నటించారు. హాస్యం పండించటంలో ఇద్దరూ పోటీపడ్డారు. దర్శకుడుగా అనిల్ రావిపూడి సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు. అటువంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్3గా మరోసారి కనువిందు చేయబోతుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది. రాబోయే సంక్రాంతికే సినిమా రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ.. కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు.. జనాల్లో ఇప్పటికీ అదే భయం ఉండటంతో థియేటర్లకు జనం ఎంత వరకూ వస్తారనే ఆందోళన కూడా లేకపోలేదు. అందుకే.. 2021 వేసవిలో అంటే.. ఏప్రిల్‌లో ఎఫ్3 రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావిస్తుందట. అయితే.. వెంకటేష్, వరుణ్‌తేజ్‌తోపాటు.. మరో ప్రముఖ హీరో కూడా నటిస్తున్నారట. కానీ.. ఆ హీరో ఎవరనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్.