FNCC తరఫున వరద బాధితుల సహాయ నిధికి 25 లక్షల విరాళం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఇటీవల భారీ వర్షాల వల్ల వరదలు రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే వరద బాధితుల సహాయార్ధం ఇప్పటికే ఎందరో సినీ మరియు ఇతర రంగాల ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎఫ్ ఎన్ సి సి తరఫున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి 25 లక్షల విరాళాన్ని అందజేసిన ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు గారు, సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి గారు, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు గారు.

ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు గారు,మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రతిసారి ఎఫ్ ఎన్ సి సి క్లబ్ సహాయ కార్యక్రమాలలో ముందు వుంటుంది అని తెలియ చేసారు.

ఈ సందర్భంగా సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ : ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణలో గాని ఎలాంటి విపత్తు వచ్చినా ఎఫ్ ఎన్ సి సి తరఫున సహాయం గతంలో చేసాం ఇప్పుడు,ఎప్పుడు చేయడానికి ముందుంటాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి 25 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిలిం నగర్ క్లబ్ కి చాలా అండగా నిలబడుతున్నాయి. అందుకుగాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎఫ్ ఎన్ సి సి ఎప్పుడు ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో ముందుంటుంది అని తెలియ చేశారు.

ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులను రెండు రాష్ట్రాల సీఎం లు అభినందించారు.

Previous articleమిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ మినిస్టర్‌గా ‘పవన్‌కళ్యాణ్‌’
Next articleపవర్‌(స్టార్‌)ఫుల్‌ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here