RGV పవర్ స్టార్ – ఎన్నికల ఫలితాల తర్వాత అనే టాగ్ లైన్ తో చెప్పినట్లు గానే ఈ రోజు 11 గంటలకి వర్మ రిలీజ్ చేసాడు. ఈ సినిమా నిడివి 37 నిమిషాలు ఉండగా చివరి 10 నిమిషాలు మాత్రం ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ పై వర్మ తనకున్న అభిమానాన్ని తానే నటించి ప్రదర్శించాడు.
పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులని కొంత అవమానిస్తూనే ఈ సినిమాలో సంభాషణలు వున్నాయి. చిరంజీవి, నాగబాబు,అన్న లెజినోవా, కత్తి మహేష్, బండ్ల గణేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, చంద్రబాబునాయుడు క్యారెక్టర్లని చూపించినప్పటికీ వారందరి వల్ల పవన్ కళ్యాణ్ కి నష్టమే జరిగిందని ఈ సినిమా చిత్రీకరించాడు వర్మ. ఇంకా ముఖ్యం గా పవన్ మిత్రుడు రాజా రవి తేజ తో కలిసి రాసిన ఇజం పుస్తకం ఒక రష్యన్ పుస్తకానికి కాపీ అని దాని వల్లనే పవన్ కళ్యాణ్ కి వున్నా మంచి వ్యక్తిత్వం కనుమరుగయిందని, ఆ మిత్రుని వల్లనే పవన్ ఇమేజ్ తగ్గిందని చెప్పే ప్రయత్నం చేసాడు వర్మ.
చివరి 10 నిమిషాలు వర్మ స్వయంగా నటించి అందరూ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని వాడుకొని డెవలప్ అయ్యారు, నమ్మించి మోసం చేశారనే విషయాన్ని హైలైట్ చేసాడు. వర్మ తాను పవన్ కల్యాణ్ కి అభిమాని అని చెప్తూ 2024 లో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని వోడ్కా తాగుతూ, పవన్ కాళ్ల దగ్గర కూర్చొని కోరుకోవటం ఆసక్తి కరమైన అంశం.