ఒక్క‌ఛాన్స్‌.. పాక్‌, చైనాకు చ‌మ‌ట్లే !!

చైనా… ప్ర‌పంచాన్ని శాసించాల‌ని ఉవ్విళ్లూరుతుంది. చిన్న‌దేశాలైన టిబెట్‌, నేపాల్‌, శ్రీలంక త‌దిత‌ర దేశాల‌కు అప్పులిచ్చి ఆశ చూపుతూ ప‌బ్బం గ‌డుపుకుంటోంది. నిన్న‌టి వ‌ర‌కూ భార‌త్ అంటే ఆయా దేశాల‌కు ఉండే అభిమానాన్ని దూరం చేస్తోంది. నిజానికి చైనా చాలా వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. 1969 నాటి ప‌రిస్థితులే ఇప్ప‌టికీ భార‌త్‌లో ఉన్నాయ‌నే గుడ్డిన‌మ్మ‌కంతో అతిగా ఆవేశ‌ప‌డింది. గాల్వాన్ లోయ వ‌ద్ద అతిగా ప్ర‌వ‌ర్తించి చివ‌ర‌కు పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ(చైనా ఆర్మీ) ఎంత మంది సైనికులు భార‌త్ ఆర్మీ చేతిలో దిక్కులేని చావు చచ్చార‌నేది బ‌య‌టి ప్ర‌పంచానికి చెప్ప‌లేని దీన‌స్థితిలోకి చేరింది. ఇదే స‌మ‌యంలో భార‌త్ యుద్ధం వ‌స్తే ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని ర‌కాలుగా సిద్ధ‌మైంది. రాఫెల్ యుద్ధ‌విమానాల కొనుగోలు, ఫ్రాన్స్‌, అమెరికా, ర‌ష్యా వంటి మిత్ర‌దేశాల‌తో ఆయుధ‌, సైనిక సాయంపై చ‌ర్చ‌లు. మ‌రోవైపు చైనాను ఆర్ధికంగా దెబ్బ‌తీసేందుకు మోదీ వ్యూహాత్మ‌కంగా ముంద‌డుగు వేశారు. అస‌లు సిస‌లైన రాజ‌నీతి ఎలా ఉంటుంద‌నేది చైనాకు రుచిచూపారు. ఫ‌లితంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా చైనా అంటే వ్య‌తిరేక‌త తారాస్థాయికి చేరింది.

ఆసియాలోనే పేద్ద మార్కెట్ అయిన భార‌త్ ప్ర‌భావం అమెరికా పై ప‌డింది. చైనా యాప్స్‌ను వ్యాపార లావాదేవీల‌ను వ‌ద‌లుకునేందుకు సిద్ధ‌మైంది. ఇదిలా ఉంటే చైనా వ‌ల్ల‌నే క‌రోనా ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ‌నాశ‌నం చేసింద‌నే ట్రంప్ మాట‌ల‌ను నిజం చేస్తూ చైనా శాస్త్రవేత్త‌లు కూడా త‌మ దేశానికి ప్ర‌తికూలంగా మాట్లాడారు. ఇవ‌న్నీ జీర్ణించుకోలేని చైనా ఇప్ప‌టికీ భార‌త్ అంత‌ర్గ‌త విష‌యాల్లో జోక్యం చేసుకుంటూనే ఉంది. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు భార‌త్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకుందంటూ త‌ప్పుబ‌ట్టింది. దీనిపై ఇండియా కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో భార‌త్‌లోని క‌శ్మీర్ త‌మ‌దేనంటూ పాకిస్తాన్‌, కాలాపానీ మాదేనంటూ.. మ‌రోసారి అస‌లు రాముడు మావాడంటూ నేపాల్ పాల‌కులు నోరు జారుతున్నారు. భార‌త్ అంటేనే భ‌య‌ప‌డే ఆ దేశాల స్వ‌రం పెంచ‌టానికి చైనా ప‌రోక్షంగా సాయం చేస్తోంది.

మ‌క్‌మోహ‌న్‌రేఖ వ‌ద్ద చైనా ఆర్మీ ఇప్ప‌టికీ మోహ‌రించే ఉంది. యుద్ధం చేయాల‌నే ఆరాటం నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతుంది. అందుకే దీనికి ధీటుగానే ఇండియ‌న్ ఆర్మీ స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌కు భారీగా చేరుతుంది. యుద్ధ‌ట్యాంకులు, యుద్ధ విమానాల‌ను స‌రిహ‌ద్దుల స‌మీపంలోకి చేర‌వేస్తుంది. పాక్‌, చైనా ఇరు దేశాల‌తో యుద్ధం చేయాల్సి వ‌స్తే.. రెఢీ అంటూ భార‌త్ స‌న్న‌ద్థ‌త ఇప్పుడు శ‌త్రుదేశాల‌నే కాదు.. ప్ర‌పంచాన్ని కూడా వ‌ణికిస్తోంది. ఎందుకంటే.. క‌ద‌న‌రంగంలో తామేమిటో చూపేందుకు ఇండియ‌న్ ఆర్మీ ఒక్క‌ఛాన్స్ కోసం ఎదురుచూస్తోంది. అది చైనా, పాకిస్తాన్‌ల‌కు చావు దెబ్బ‌తీస్తుంద‌నేది శ‌త్రుదేశాల‌కూ తెలుసు. అందుకే.. సింహం తో ముఖాముఖి త‌ల‌ప‌డ‌లేక‌.. న‌క్క‌ల మాదిరిగా వంక‌ర‌బుద్ది ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌నేది అంత‌ర్జాతీయ విశ్లేష‌కుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here