రాజాసింగ్.. బీజేపీలో ఫైర్‌బ్రాండ్. హిందుత్వ నినాదాన్ని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లగల నాయకుడు. రెండుసార్లు వరుసగా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గాడు. అది కూడా.. టీఆర్ ఎస్ చాలా గట్టిగా.. ఎంఐఎం అండగా ఉన్న రెండుసార్లు రాజాసింగ్‌ను ఓడించలేకపోయారు. ఆ ఒక్క ఉదాహరణ చాలు. తాను ఎంతగా ప్రజలకు దగ్గరయ్యాడనేందుకు.. కాస్త ఆవేశంపాళ్లు ఎక్కువే అయినా.. ఆయన అభిమానులు మాత్రం.. ఇక్కడ ప్రత్యర్థులకు ధీటుగా సమాధానం ఇవ్వాలంటే ఆ మాత్రం ఆవేశం ఉండాలంటూ సమర్థిస్తుంటారు. కానీ.. బీజేపీ అదిష్ఠానం ఎందుకో. రాజాసింగ్‌ను ఎదిగే అవకాశాలను కల్పించలేకపోతుందనే ఆవేదన పలుమార్లు కార్యకర్తల నుంచి వ్యక్తమైంది. తాజాగా.. రాజాసింగ్ ఫేస్‌బుక్ ఎకౌంట్‌ను రద్దుచేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాజాసింగ్ ఘాటుగానే స్పందించారు. తాను ఎప్పుడూ కమ్యూనల్ మధ్య తగాదా పెట్టేలా. రెచ్చగొట్టేలా మాట్లాడలేదన్నారు. తన పేరుతో అకౌంట్లు ప్రారంభించి నడిపించేవారి పట్ల తానేం చెప్పలేనన్నాను. కేవలం దేశం, ప్రజలు, తనను నమ్మిన వారి పట్ల మాత్రమే ఫేస్‌బుక్‌లో స్పందిస్తానంటూ చెప్పారు. 2018లో తన ఎకౌంట్‌ను హ్యాక్ చేసినపుడు పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ గుర్తుచేశారు. ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా ఎందుకు వారి అకౌంట్లు రద్దు చేయలేదని ప్రశ్నించారు. 130 కోట్ట మందిని చంపుతానంటూ సవాల్ విసిరిన వారిపై ఎలాంటి చర్య తీసుకున్నారంటూ అడిగారు. వారంతా దర్జాగా అకౌంట్లు ప్రారంభించి.. దర్జాగా నడుపుతుంటే.. తన పట్ల ఎందుకిలా వివక్షత ప్రదర్శిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇంతగా రాజాసింగ్ అంటే భయపడుతున్నదెవరు. ఎందుకనేది మాత్రం సస్పెన్స్.
రజ్జు భయ్యా…హాట్స్ ఆఫ్