కొన్నేళ్ల క్రితం.. రాష్ట్ర విభజన జరిగాక ఏపీలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుంది. ఆ సమయంలో ఓ నాయకుడు అకస్మాత్తుగా కార్యక్రమానికి హాజయ్యాడు. అంతే.. సైలెంట్‌గా ఉన్న అక్కడంతా కేకలు. ఈలలు.. అంతగా రెస్పాన్స్ వచ్చేందుకు కారణం.. అక్కడకు వెళ్లిన నాయకుడు రేవంత్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి పై ఏసీబీ కేసు నమోదుచేయటం.. అరెస్టయి జైలుకెళ్లటం జరిగాయి. రేవంత్‌రెడ్డి.. బెయిల్ వచ్చిందని తెలియగానే జైలు వద్దకు భారీగా అభిమానులు చేరారు. కిలోమీటరు దూరం ప్రయాణించేందుకు గంట సమయం పట్టిందట. ఇదంతా కేవలం రేవంత్‌రెడ్డి తన అనుకునేవారిలో ఎంతగా దగ్గరయ్యారనేందుకు ఉదాహరణ. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు.. అక్రమాలపై విమర్శలు ఇవన్నీ సర్వసాధారణమే అనుకుందాం. కొన్నిచోట్ల మాత్రం అవన్నీ నిజమే అనిపిస్తాయి. రేవంతుడు కూడా అదే బాటలో తప్పటడుగులు వేస్తూ సరిదిద్దుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అన్నింటినీ మించి మాటల తూటాలతో ప్రత్యర్థులకు ఉలికిపాటు తేగలరు. కొన్నిసార్లు.. అదే అవేశంతో తలనొప్పులు తెచ్చుకోనూ గలరు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన రేవంత్‌రెడ్డి 2009, 2014 రెండుసార్లు కొడంగల్ శాసనసభ్యుడుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణలో 2018 ఉప ఎన్నికల్లో 11000 ఓట్ల మెజార్టీతో ఓటమి చవిచూశారు. దాదాపు రేవంత్ రెడ్డి రాజకీయం ముగిసినట్టుగానే లెక్కలు గట్టారు. కేవలం దూకుడు స్వభావంతో రాజకీయ జీవితం చెడగొట్టుకున్నాడని ఎద్దేవాచేసిన వారూ లేకపోలేదు. కానీ.. 2019లో పోటాపోటీగా జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో మల్కాజగిరి ఎంపీగా 10,919
ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీజేపీ, టీఆర్ ఎస్ ధీటుగా ఉన్న సమయంలోనూ విజయం సాదించటం రేవంత్‌రెడ్డి కి మాత్రమే సాద్యం కావటం.. కాంగ్రెస్ హైకమాండ్‌ను ఆకట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు రేవంత్ వంటి నాయకత్వం అవసరమని రాహుల్‌గాంధీ కూడా అంచనా వేసుకున్నారట. కానీ.. పార్టీలో సీనియర్లు కూడా పీసీసీ పీఠంపై
ఆశలు పెట్టుకోవటంతో అదిష్ఠానం ఆచితూచి స్పందిస్తుందట. కానీ.. ఎట్టకేలకు రేవంత్‌రెడ్డికే పీసీసీ పీఠం కట్టబెట్టాలని దాదాపు నిర్ణయం ఖరారైందట. ఇది రేవంత్ అభిమానులకు శుభవార్తే. కానీ.. మిగిలిన నేతలను కలుపుకుని ముందుకు సాగటం.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ ఎస్, బీజేపీలకు ధీటుగా ఉండటం.. వీలైనన్ని సీట్లను గెలుచుకోవటం ముందున్న మొదటి సవాల్.