భారతదేశంలో ఆరోగ్య బీమా సౌకర్యం లేని 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరేలా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్యయోజన(పీఎంజేఏవై)కు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ టీపీ ఏ టిమిలెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల మద్దతు తెలిపారు. అత్యుత్తమ బీమా సంస్థలతో కలసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. బీమా పథకాలను అభివృద్ధి చేసేందుకు, సాంకేతికత, ఆధునిక పరిజ్ఞానం ముఖ్యమన్నారు. తమకున్న విస్తారమైన నెట్వర్క్తో బీమాను సామాన్యులకు చేరువ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఈ సంస్థ కర్ణాటకలో ఆరోగ్యభాగ్య పేరిట పోలీసులకు, యశస్వినీ, మహారాష్ట్ర పోలీసులకు, వాజ్ పేయి ఆరోగ్య శ్రీ పథకాలతో అంతర్భాగంగా పనిచేసినట్లు వెల్లడించారు.