విగ్రహ రాజకీయం ఈ జోహార్..!!

ఒక విద్యార్థిని
ఒక స్వయం ఉపాధి లబ్దిదారుడు
ఒక సంక్షేమ హాస్టల్ నిర్వాహకుడు
ఒక ఉద్దనం బాధితురాలైన మహిళా రైతు
ఒక ఔత్సాహిక క్రీడాకారిణి
వీళ్లందరికీ ఏం కావాలి

కడుపునిండిన నాయకుల అర్ధంలేని ఆశయాల కోసం
కడుపునిండని ప్రజల అవసరాలు సైతం బలిచెయ్యాలా

“జోహార్” సినిమా క్లుప్తంగా చెప్తే ఇదే..

తెలుగు సినిమా కొత్త రెక్కలు తొడుక్కోవడం మొదలెట్టిందనడానికి ఈ సినిమా కుడా ఒక ఉదాహరణ.
స్టార్ కాస్ట్ లేకుండా కేవలం స్క్రిప్ట్ ని నమ్ముకుని ఒక సినిమా తీసిన సందర్భాలు ఈమధ్య కొన్ని కనిపించాయి కానీ క్వాలిటీ విజువల్స్,క్వాలిటీ మ్యూజిక్ అన్ కాంప్రమైజింగ్ గా ఉన్న్ ఒక సినిమా ఇది

సినిమా తియ్యడానికే గట్స్ కావాలి..అలాంటిది ఈ సినిమా తియ్యాలంటే ఇంకేదో నమ్మకం కావాలి

సినిమా ఇతివృత్తం లోకి వెళదాం..
ఒక సీఎం తన తండ్రి మరణానంతరం అతని విగ్రహం స్థాపించాలనుకోవడం
దానిక్కావల్సిన నిధుల కోసం..సంక్షేమ పధకాల లో కోత వెయ్యడం
వాటిని నమ్మి బ్రతుకుతున్న ప్రజలెలాంటి పర్యవసానాలెదుర్కొన్నారన్న కధా కధనం ముందుగానే ఊహిచగలిగేదే..గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎమీ కాదు, కానీ రాసుకున్న కోటబుల్ డైలాగ్స్ తప్పని సరిగా చెప్పుకోవాలి, ముఖ్యంగా
ముఖ్యమంత్రి పాత్రధారి చైతన్య కృష్ణ చెప్పే
“శత్రువులు అరిచేది కాదు పాలకులు రాసేది చరిత్ర”
“ఇంత పెద్ద రాజ్యాంగం ఉన్న దేశంలో ఏదైనా పెద్దగా ఉంటేనే గుర్తిస్తారు” లాంటి డైలాగులు నిగూఢంగా అనిపిస్తాయ్.
“రక్తమిస్తే స్వాతంత్య్రం వస్తుందన్నావ్ కదా, మరి ఏమిస్తే మన ఇంటికి కొత్త పెంకులొస్తాయి”
లాంటి డైలాగ్స్ సందర్భోచితంగా ఉంటాయి.

ప్రభుత్వాలు మారినా…పధకాల పేర్లు తప్ప ఎమీ మారవా..శాటిలైట్ నుంచి చూసినా కనిపించాలని కట్టే ఎత్తైన కట్టడాల మాటున శవ జాగారాలు చేసే ఆకలి బ్రతుకులు కనపడట్లేదేమొ అనిపిస్తుంది ప్రేక్షకుడికి.

పెర్ఫార్మెన్సస్ దగ్గరకొస్తే, కూతుర్ని బ్రతికించుకోవడం కోసం ఆరాటపడే ఉద్దానం రైతుగా ఈస్వరీరావు
తాను నమ్మిన సిద్ధంతాలల్కి కట్టుబడి ఉండటానికోసం ప్రాణలర్పించడానికి సిద్ధపడే వృద్దుడి పాత్రలో శుభలేఖ సుధాకర్ నటన, అతనికి లైఫ్ టైం బెస్ట్ అనే చెప్పాలి.
చైతన్యకృష్ణ ముఖ్యమంత్రిగా నెగటివ్ షేడ్స్ ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు
అథ్లెట్ గా నైనా గంగూలీ బాగానే చేసినా ఆమెకు చెప్పిన సంభాషనలు హిందీ తెలుగు ఏదీ సరిగ్గా మట్లాడక ప్రేక్షకుడు సందిగ్ధంలోకి పోతాడు
టీనేజ్ జంట దృస్యం ఫేం ఎస్తర్ దెబ్యూ నటుడు అంకిత్ కొయ్య చాలా ఈజ్ తో కూడిన నటన ..ఓకే

టెక్నికల్ విషయాలకొస్తే
సినిమాకి సినిమాటోగ్రఫీ అతి పెద్ద అసెట్
చిన్న బడ్జెట్ సినిమాల్లో మనం చూడని క్వాలిటీ విజువల్స్,అందమైన లొకేషన్లు ఎంచుకోవడమే గొప్ప కాదు వాటిని ఎలా చూపెట్టాలో కూడా తెలిసుండాలి..ఆ విషయంలో బాగానే సక్సెస్సయ్యాడు దర్శకుడు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ పాటలు బానే ఉన్నా పాడే వాళ్లు సరిలేకపోతే అంతే సంగతులు
వారణాశి బ్యాక్ డ్రాప్ లో వచ్చే ర్యాప్ సాంగ్ ఐడియా లిరిక్స్ యునీక్ గా అనిపిస్తుంది.
మొత్తానికి తెలుగు సినిమాకి మరో దమ్మున్న కొత్తతరం దర్శకుడు దొరికాడు…తేజ మారిని.

-కళ్యాణ్ కిషోర్, విశ్లేషకుడు

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here