నిజంగానే ఇతగాడికి తిక్కఉందా! అంటే మాటల్లో లెక్కతప్పడు. పోనీ రాజకీయంగా ఏమైనా లాభపడదామా! అనుకుంటున్నాడా! అనుకుంటే.. అబ్బే ఉన్నదంతా ఆపదలో ఉన్నోళ్లకు దానం చేస్తుంటాడు. ఏదో ఒకటి మనసులో లేకపోతే ఇదంతా చేస్తాడంటారా! అనుకునేలోపుగానే.. ఎన్డీఏ కూటమిలో ఉన్నపుడు మోదీ ఏదడిగినా పవన్ కాళ్ల ముందు వాలేది. పోన్లే సినిమాలైనా చక్కగా తీసి కోట్లు వెనుకేసుకుంటాడా! ఇప్పుడే వరుసగా ఆరు సినిమాలకు డేట్లు ఇచ్చాడు. ఆ డబ్బు కూడా 2024 నాటికి ఎన్నికల కోసమా.. లేకపోతే… ఆప్తుల అవసరాలు తీర్చుందుకా! ఏదో మార్పు తేవాలనే తపన మాత్రం కనిపిస్తుంది. గడ్డం పెంచి యోగిలా దర్శనమిస్తాడు. ఎందుకిలా.. ఏమైనా ప్రచార ఆర్భాటమా! అంటే సింపుల్ లివింగ్. నేను నేనుగా జీవించటం అంటూ వేదాంతం చెబుతాడు. ప్రత్యర్థులు విమర్శిస్తున్నట్టు.. ఎందుకీ మూడుపెళ్లిళ్లని ఎవరైనా అడిగితే.. నాకేమైనా సరదానా. నా తలరాత ఇలా ఉందంటూ కాలానికి సమాధాం వదిలేస్తాడు.
మొక్కలను ప్రేమిస్తాడు.. అభిమానులను ఆదరిస్తాడు.. ఆపదలో ఉన్నవారికి ఆప్తమిత్రుడుగా వెంట ఉంటాడు. రాజకీయాల్లో నువ్వు పనికిరావంటూ సన్నిహితులు ఎవరైనా సలహాలిస్తే.. మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఓడినా ఇష్టమేనంటాడు. గెలుపుతో పొంగిపోడు.. ఓటమిలో కుంగిపోడు. ఇవన్నీ అభిమానులకు స్పూర్తి. ఎర్రజెండాతో దోస్తీ అంటాడు.. అబ్బే వారి తీరు బాగాలేదంటూ ముఖానే చెప్పేస్తాడు. కాషాయంతో జతకట్టేస్తాడు. హిందుత్వ నినాదం.. మానవత్వమే ప్రచారం అన్నట్టుగా ఉంటాడు. మొక్కల మధ్య ఉంటానంటాడు. పాలేకర్, జయరామ్ వంటి ప్రకృతి వ్యవసాయ పరిశోధకులతో కలసి కొత్త తరహా వ్యవసాయంపై అధ్యయనం చేస్తున్నాడు. ఆరు నెలలుగా.. జనమంతా.. పైసాపైసా దాచుకుని భద్రపరచుకుంటుంటే.. జనసైనికులు మాత్రం.. ఉన్నదంతా ఆపదలో ఉన్నవారికి అందిస్తున్నారు. ఆకలితో బాధపడుతున్న వారి ఆకలి తీర్చుతున్నారు. అంతేలే.. నడిపించే సేనాని ఉంటే.. సైనికులు కూడా ఇలాగే ఉంటారు. అనుసరిస్తుంటారు. అసలు పవన్ మనసులో ఏముంది.. ఆయన ప్రణాళికలేమిటీ..? అర్ధంకాని ఎన్నోప్రశ్నలకు.. కాలమే సమాధానం చెప్పాలి.



