చిరంజీవి అంటే బ్రేక్ డ్యాన్స్‌లు.. ఫైట్స్.. మాస్‌కు రెండున్నర గంటల వినోదం. ఖైదీ నుంచి ఖైదీనెంబరు 150 వరకూ అదే జోరు. అదే వేగం.. స్టెప్పులతో మతులు పోగొడుతూ.. ఇప్పటి కుర్రహీరోలతో సై అంటున్నారు. అంతగా తెలుగు సినిమాను ఏలుతూ.. ఇప్పుడు శాసించేంతగా ఎదిగారు. దర్శకుడు దాసరి నారాయణరావు తరువాత తెలుగు సినీ పరిశ్రమకు పెద్దన్నగా మారారు. చిన్న, పెద్ద అంటూ తేడాలేకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ లాక్‌డౌన్ విధించారు. సుమారు 20 000 మంది సినీ కార్మికుల కోసం ప్రత్యేకంగా ఛారిటీ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. కోట్లురూపాయలు సేకరించి అందరికీ నిత్యావసరాలు అందజేశారు. ఇదే సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య తీస్తున్నారు. ఇప్పటికే 80 శాతం సినిమా పూర్తయింది. తరువాత మరో రెండు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. కుర్ర దర్శకులకు అవకాశం ఇస్తామని చెప్పేశారు. అయితే కొత్తగా రాబోయే సినిమాల్లో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ గాకుండా.. పూర్తి భిన్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. చిరు అంటే కేవలం మాస్.. మాస్ కానీ.. మధ్యలో స్వయంకృషి, ఆరాధన, అపద్బాందవుడు , రుద్రవీణ వంటి సినిమాలతో కొత్త ప్రయోగాలు చేశారు. సుప్రీంహీరోగా ఉన్నపుడే అంత ప్రయోగాలు చేసిన చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్‌గా మమ్ముట్టి, అమితాబ్, మోహన్‌లాల్ తరహాలో వయసుకు తగిన పాత్రలు.. సామాజిక, రాజకీయ సందేశం ఇచ్చేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. మరి చిరులోని కొత్త హీరోను అభిమానులు ఎలా స్వీకరిస్తారో చూడాలి.