జలపాతం వద్ద సెల్ఫీ తీసుకోవాలనే కోరిక యువతి ప్రాణాలను బలితీసుకుంది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు గ్రామ నివాసి పోలవరపు లక్ష్మణరావు కుమార్తె కమల ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడే మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి మంచి ఉద్యోగం కూడా తెచ్చుకున్నారు. కొలంబియాలో ఉంటున్నారు. వీకెండ్ కావటంతో బంధువుల ఇంటికి వస్తూ.. మధ్యలో అట్లాంటాలోని జలపాతం వద్దకు చేరారు. కాసేపు సరదాగా గడుపుదామనుకున్నారు. అందమైన జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కమల నీటిలో పడి మరణించారు. అక్కడి తెలుగు సంఘాల సహకారంతో ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.



