ఆయిల్ పామ్ రైతులకు మరింత రవాణా ప్రోత్సాహకం ఇస్తున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ

కరోనా కారణంగా అన్ని రంగాలు అనేక రకాలుగా నష్ట పోయాయి, దీనికి రైతులు కూడా బాధితులే, ఇటువంటి కష్ట సమయంలో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి సమయంలో  రైతులకు అన్నిరకాలుగా  సహాయం అందించడంలో ముందుండే 3 ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ రైతులకు ఆయిల్ పామ్ గెలలను ఫ్యాక్టరీకి తరలించేందుకు అయ్యే ఖర్చు రవాణా ప్రోత్సాహకం ఇస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో  ఇంధన ధరలు పెరగడం వలన గెలలను ఫ్యాక్టరీకి తరలించే రైతులకు మరింత సహాయం చేయాలనీ ఈ రవాణా ప్రోత్సాహకం పెంచి ఇస్తున్నారు. దీని ద్వారా రైతులు తమ పంటలను రవాణా చేయడానికి అయ్యే వ్యయం మరింత కలిసివస్తుంది.

” 3 ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ   రైతుల ఆర్థిక పరిస్తులను అర్థంచేసుకుని వారికి అనేక రకాలుగా సహాయం చేస్తుంది. ఈ కరోనా సమయంలో కూడా ఆర్థికంగా మేలు చేయాలనే ఉద్యేశంతో ఈ రవాణా ఇన్సెంటివ్ పెంచడం జరిగిందీ. దీని వలన రైతులు తప్పకుండా లబ్ది పొందుతారు అని 3 ఎఫ్ ఆయిల్ పామ్ సంస్థ మేనేజింగ్  డైరెక్టర్  సంజయ్ గోయెంకా గారు తెలిపారు.”

గెలల రవాణా ప్రోత్సాహకం  కనిష్టంగా 175 రూపాయల నుండి గరిష్టంగా 300 రూపాయల వరకు పెంచడం జరిగింది. సెప్టెంబర్ 1 తేదీ నుండి అమలులోకి వస్తుంది.

పెరిగిన గెలల రవాణా ప్రోత్సాహకం వివరాలు ఇలా ఉన్నాయి

5 కిలోమీటర్ లోపు దూరంలో ఉన్న రైతులకు పాత దర రూ. 125 చెళ్ళిస్తుండగ ఇప్పుడు రూ. 175 ఇవ్వడం జరుగతుంది.

6 నుంచి 10 కిలోమీటర్ రవాణా ప్రోత్సాహకం పాత దర రూ.150 నుంచి రూ. 200 కి పెంచారు. 11-15 కిలోమీటర్ల వారికి  పాత దర రూ.210 నుండి రూ.260 కి పెంచారు.

16 – 20 కిమి వారికి పాత దర రూ. 210 నుండి రూ. 275 పెంచారు.

20 కిలోమీటర్ల పైన వారికి

పాత దర రూ. 215 నుండి రూ. 300 పెంచడం జరిగింది.

Previous articleFlipkart Launches MarQ Android 9.0 Smart TV range for Indian Consumers
Next articleన్యాయవ్యవస్థలో సంస్కరణలకు విశాలవేదిక – జనచైతన్య వేదిక కృషి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here