బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండుగే. సింహా సినిమాతో తన విశ్వరూపం ప్రదర్శించిన నటసింహం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్ అంటే బాక్సాఫీసు వద్ద సందడే. వరుసగా హ్యాట్రిక్ కొట్టేందుకు ఇద్దరూ ఒక సినిమా చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా దసరాకు విడుదల కావాల్సి ఉన్నా.. కరోనాతో వాయిదా పడింది. సినిమా టైటిల్ మాత్రం చర్చలు సాగుతున్నాయి. బాలయ్య స్టామినా… ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా టైటిల్ ఉండాలని యూనిట్ కసరత్తు చేస్తోంది. హీరోయన్‌గా కీర్తిసురేష్, అంజలీ పేర్లు పరిశీలిస్తున్నా రట.అయితే సోషల్ మీడియాలో మాత్రం.. మోనార్క్ పేరు ట్రోల్ అవుతోంది. మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నా అందరూ మోనార్క్కే ఓటేశారట. ఇది నిజమా! కాదా! అని తెలియాలంటే దసరా వరకూ ఆగాల్సిందే.



