పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్. అందులోనూ చానాళ్ల విరామం తరువాత పవన్ నటిస్తున్న సినిమాపై ఎన్నో అంచనాలు. ఇప్పటికే దిల్‌రాజు సారథ్యంలో వకీల్‌సాబ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దాదాపు పవన్ ఆరు సినిమాలకు సంతకాలు చేశారు. ఒక్కొకటిగా పట్టాలెక్కతున్నాయి. ఎంఎం.రత్నం నిర్మాతగా.. కీరణవాణి సంగీతంతో క్రేజీ దర్శకుడు క్రిష్ . పవన్ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందనేది కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. పది హేను రోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టారట. దాదాపు మెయిన్ సినిమాదాదాపు పూర్తికావస్తోందని సమాచారం. క్రిష్ సినిమా అంటేనే.. అంచనాలు మరింతగా పెరుగుతాయి. దానికి పవన్ కూడా తోడవటంతో ఎలా ఉండబోతుందనేది ఊహకందని విషయం. అయితే టైటిల్‌పై మాత్రం చర్చ సాగుతోందట. బందిపోటు, విరూపాక్ష, ఓం శివమ్ వంటి పేర్లు వినిపిస్తున్నా.. క్రిష్ ట్వీట్ చేసిన అంతర్వాహిని పేరు ఆసక్తిగా కనిపించింది. సినిమాకు దాదాపు ఇదే టైటిల్ కావచ్చనే ఊహాగానాలకు మరింత బలమొచ్చింది. ఏమైనా.. క్రిష్-పవన్ సినిమా అంతర్వాహినీ అనేది ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారట.