ఇంటిల్లిపాదీకి వినోదాన్ని అందించే సినిమా. ఏడు నెలలపాటు దూరమైంది. శుక్రవారం వచ్చిందంటే చాలు. సినిమా థియేటర్ల వద్ద సందడే సందడి. కరోనా దెబ్బకు అవన్నీ మూతబడ్డాయి. చేతిలో సొమ్ములకూ ఇబ్బందిగా మారింది. దీంతో వినోదం అరచేతిలోకి చేరింది. సెల్ ఫోన్లు. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ల్లోకి దూరి ఆనందాన్ని పంచుతోంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్, జీ వంటి ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. సెలవురోజు కుటుంబంతో కలసి వినోదాన్ని ఆస్వాదించేందకు అవే సినిమా థియేటర్లుగా మారాయి. ఇటీవల బా్లీవుడ్, టాలీవుడ్‌లో చాలా సినిమాలో ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అది కూడా సినిమా సెంటిమెంట్ ప్రకారం శుక్రవారమే సుమా.. ఈ సారి శుక్రవారం అంటే.. అక్టోబరు 2వ తేదీన ఆహాలో రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా నటించిన ఒరేయ్ బుజ్జిగా విడుదల కాబోతుంది. అందాల తార అనుష్క నటించిన నిశ్చబ్దం కూడా అదే రోజు అమెజాన్ ప్రైమ్‌లో కనువిందు చేయబోతుంది. ఆ రోజు ఎలాగూ సెలవు కాబట్టి.. సకుటంబ సమేతంగా ఎంచక్కా.. సినిమా చూసి థియేటర్లు లేవనే బాధ నుంచి కాస్త బయటపడవచ్చన్నమాట. మరి.. ఆ రోజు స్నాక్స్.. ఫుడ్ ఐటమ్స్ ఏమెమి ఎరేంజ్ చేసుకోవాలో ముందుగానే ఆలోచించుకోండి.