ముమైత్‌ఖాన్‌కు చాలా కోపం వచ్చింది. మస్త్ గుస్సా అయ్యారు. ఇదంతా ఎందుకంటారా! ఈ మధ్య ముమైత్ సరదాగా గోవా ట్రిప్ వెళ్లొచ్చారు. ఇందులో గొడవ ఎందుకంటారా.. అయితే క్యాబ్ డ్రైవర్ రాజుకు ఇస్తానన్న కిరాయి ఇవ్వలేదంట. దీంతో అతగాడు.. తన బాధంతా సెల్ఫీవీడియోలో వెళ్లగక్కాడు. అంతే.. ముమైత్ ఊరుకుంటుందా.. తనమీద ఇన్ని ఆరోపణలు చేసిన క్యాబ్ డ్రైవర్ రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మీద ఇన్ని అబాండాలు వేసి.. మోసం చేసిన అతడిని అస్సలు వదలంటూ చెప్పారన్నమాట.