పీవీ సింధు లండన్ ప్రయాణం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకూ వివాదాలకు ఆమడంత దూరంలో ఉండే ఒలంపిక్ విజేత సింధు ఎందుకిలా చేసిందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదంతా పుల్లెల గోపిచంద్ పుణ్యమేనంటూ సింధు తండ్రి రమణ ఆరోపించారు. 2018 ఆసియా క్రీడల తారువా కోచ్ ధోరణిలో మార్పువచ్చిందని సింధును దూరంగా ఉంచటమే గాకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ చెప్పారు. పి.వి.సింధు ఒకప్పుడు సాధారణ క్రీడాకారిణి.. ఆసియా, వరల్డ్, ఒలంపిక్స్‌లో వరుస విజయాలతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకుంది. వాస్తవానికి బ్యాడ్మింటన్‌లో ఇదేం కొత్త కాదు. కానీ.. పుల్లెల గోపిచంద్ తరువాత అంతగొప్ప విజయాలు అందుకోవటమే కాదు.. గురువును మించిన శిష్యురాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంత వరకూ ఏపిసోడ్ అద్భుతం.. అమోఘం. క్రీడాచరిత్రను తిరగరాసిన సింధు, గురువు గోపిచంద్‌కు పురస్కారాలు.. బోలెడు డబ్బు సమకూరాయి. ఇద్దరూ బాగానే లాభపడ్డారు. మరి ఇంతలో ఏమైందీ.. రెండేళ్లుగా గురు, శిష్యురాలి మధ్య దూరం ఎందుకు పెరిగిందనేందుకు చాలా కారణాలున్నాయట.
ఒలంపిక్స్ విజేతగా నిలిచాక సింధుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే సత్కరించాయి. తెలంగాణ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో కోట్లాదిరూపాయల విలువైన స్థలం ఇచ్చింది. పక్కనే మరో 500 చదపు మీటర్ల స్థలం అడిగిన సింధు కుటుంబానికి సారీ చెప్పింది. ఏపీ సర్కారు కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించటమేకాదు.. గ్రూప్1 అధికారి స్థాయి హోదా ఇచ్చింది. బ్యాడ్మింటన్ శిక్షణకు సెలవులు కూడా మంజూరు చేసింది. కానీ ఇంతలోనే సింధు, గోపిచంద్ మధ్య అంతర్గత వార్ మొదలైంది. రెండేళ్లుగా సరైన శిక్షణ లేకపోవటం వల్ల తాను ఫామ్ కోల్పోతున్నానంటూ సింధు కొరియా నుంచి కొత్త కోచ్‌ను నియమించుకున్నారు.ఆ తరువాత కొన్నాళ్లకే ఆయన వెళ్లిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే క్రీడానైపుణ్యం, పిట్నెస్,ఫుడ్ మూడు చాలా కీలకం. కానీ అవేమీ తనకు లేకపోవటం వల్ల లండన్ వెళ్లాల్సి వచ్చిందనేది సింధు తండ్రి రమణ చెబుతున్న మాటలు. గోపిచంద్ కూడా స్పందించలేదు. సింధు తన గురించి మాట్లాడినపుడు తాను బదులిస్తానంటూ తెగేసి చెప్పారు.
క్రీడల్లో రాజకీయాలు కొత్తేమి కాదు.. మొన్నటికి మొన్న హైదరాబాద్ క్లికెట్ అసొసియేషన్‌లో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. అజారుద్దీన్ వంటి క్రీడాకారులు గొంతెత్తి.. అసలు రాజకీయాలకు క్రీడా సంస్థలే వేదికలంటూ చెప్పకనే చెప్పారు. అందాకా ఎందుకు.. ఇటీవల క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో అంబటిరాయుడును పక్కనబెట్టడం వెనుక కారణాలు ఇప్పటికీ గోప్యమే.
కేవలం ఫిట్నెస్ లేకపోవటం వల్లనే రాయుడును వద్దన్నామంటూ అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సెలవిచ్చారు. ఆ ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారే.. గుంటూరు అంటేనే రాజకీయాలు.. కులాలకు వేదిక. ఆ ఇద్దరూ ఒకేరంగంలో ఉండటంతో.. రాయుడు కూడా క్రీడారాజకీయాలకు బలయ్యాడు. అద్భుతమైన ఛాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచకప్
సాధించే అవకాశాన్ని కూడా సెలక్టర్లు దూరం చేశారు. బ్యాడ్మింటన్‌లోనూ గుత్తాజ్వాల, నైనా జైస్వాల్, చేతన్ ఇలా.. ఎంతోమంది క్రీడాకారులు అంతర్గత కుమ్ములాటల్లో బోలెడంత కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. ఇప్పుడు అదే దారిలో సింధు కూడా..?



