సినీ హీరో డాక్టర్ రాజశేఖర్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఇటీవల కొద్దిరోజుల ముందు హీరో రాజశేఖర్, జీవిత, శివాని, శివాత్మిక నలుగురూ కరోనా వైరస్‌కు గురయ్యారు. రాజశేఖర్ స్వయంగా విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. కూతుళ్లిద్దరూ హోంక్వారంటైన్‌లో ఉండి కోలుకున్నారు. జీవిత, రాజశేఖర్ దంపతులు మాత్రం ఆసుపత్రిలో చేరారు. ఇద్దరు త్వరగా కోలుకుని వస్తారని ఎదురుచూస్తున్న సమయంలో రాజశేఖర్ కూతురు శివాత్మిక చేసిన ట్వీట్‌తో కలకలం రేకెత్తింది. కరోనాతో నాన్న పోరాడుతున్నారంటూ చెప్పారు. అభిమానుల ఆశీస్సులు, ప్రార్ధనలతో కోలుకుంటారని నమ్మకం వెలిబుచ్చారు. వాస్తవానికి రాజశేఖర్ దంపతులు ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకుంటారు. గతంలో రాజశేఖర్ కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. ఆ సమయంలోనే బయాప్సీ పరీక్ష కోసం శాంపిల్ పంపి వచ్చేంత వరకూ టెన్షన్ అనుభవించానంటూ గతంలోనే ఆయన చెప్పారు. వైద్యుడుగా రాజశేఖర్ నటీనటులకు చాలా సలహాలిస్తుంటారు. అయితే ఇటీవల అన్‌లాక్05 సడలింపుతో షూటింగ్‌లకు వెళ్తున్నారు. జీవిత టీవీ షోలో షూటింగ్ లో పాల్గొన్నపుడు వైరస్ చేరి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రమంగా ఇంట్లో అందరికీ పాకి ఉంటుందని తెలుస్తోంది. శివాత్మిక రాజశేఖర్ మాత్రం నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎటువంటి ప్రచారాలను నమ్మ కూడదంటూనే.. కరోనాతో పోరాటం చేస్తున్నారంటూ చెప్పటంతో అభిమానుల్లో.. టాలీవుడ్‌లోనూ ఆందోళన నెలకొంది.