సుశాంత్.. అలవైకుంఠపురంలో మంచి నటనతో ఆకట్టుకున్నారు. డ్యాన్స్‌తోనూ ఇరగదీశారు. అల్లు అర్జున్‌తో పోటీపడినట్టుగా కనిపించాడు. కాళీదాస్, కరెంట్ వంటి వాటితో తానేమిటో నిరూపించుకున్నా.. తరువాత సినిమాలు అంతగా ఆడకపోవటంతో కాస్త వెనుకబడ్డాడు. అక్కినేని నాగేశ్వరరావు మనుమడుగా పాత్రల ఎంపికలో జాగ్రత్తలు పడుతున్నారు. కొత్త దర్శకుడు , సాంకేతిక నిపుణుల సారథ్యంలో ఇచ్చట వాహనముల నిలుపరాదు సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని సుశాంత్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే.. సినిమా థియేటర్లకు అనుమతి ఇవ్వని కారణంగా.. ఓటీటీ లో విడుదల చేయాలనే ఆలోచన ఉన్నా.. నిర్మాత, దర్శకులు మాత్రం కాస్త అలస్యమైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.