అది 18 నవంబరు 1962 ఉదయం 5 గంటలు. భారత్-చైనా మధ్య యుద్ధవాతావరణం. ఏ సమయంలో ఏం జరుగుతుందనేది అంచనా వేయటం కష్టమే. అటువంటి కీ లకమైన రణక్షేత్రంలో ఒకటి హిమాచల్‌ప్రదేశ్. అక్కడే 123 మంది భారత సైనికులు తుపాకులు ఎక్కుబెట్టి పహారా కాస్తున్నారు. బృందానికి మేజర్ చేతన్‌సింగ్ నేతృత్వం వహిస్తున్నారు. సాయంత్రం సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇండో-చీనీ భాయిభాయీ అంటూనే.. పీపుల్ లిబరేషన్ ఆర్మీ(చైనా ఆర్మీ) దూసుకు వస్తోంది. చేతన్‌సింగ్ బృందం ఉన్న ప్రదేశం హిమాయాలు.. సముద్రమట్టానికి దాదాపు 1600 అడుగుల ఎత్తులో ఉన్నారు. అప్పుడు చిన్నగా వర్షం మొదలైంది. అదే వేళ 3000 మందికి పైగా చైనా సైనికులు భారత్ శిబిరంపై తమ జెండా ఎగురవేసేందుకు స్పీడుతో వస్తుంది. చేతిలో అత్యాథునిక తుపాకులు, మోటార్లు, బలమైన ఆర్టిలరీతో వచ్చేస్తోంది. ఇటువైపు ఉన్నది కేవలం 123 మంది అయినా.. ఏ మాత్రం బెదరలేదు. అదరలేదు.. చేతిలో ఉన్న తుపాకులతో సింహాల్లా దూసుకెళ్లారు. వర్షంలా కురుస్తున్న బుల్లెట్లు.. సహచరుల మరణాలు ఇవేమీ భారతీయ సైనికుల్లో ఏ ఒక్కరినీ భయపెట్టలేకపోయాయి.
ఒక్కోక్క భారత జవాన్ కనీసం 20 మందిని చంపేయాలనే కసితో వీరసింహాలుగా చెలరేగారు. కానీ శత్రువుల ధాడిలో అప్పటికే 100 మంది వరకూ భారతీయ సైనికులు వీరమరణం పొందారు. చివరకు మిగిలింది. ఆరుగురు.. ఏడుగురు మాత్రమే. అటువంటి వేళ.. మేజర్ చేతన్‌సింగ్ సహచరులను వెళ్లిపోమని ఆదేశించాడు. చేతిలో తుపాకీతో ఒంటరిగా శత్రుమూకపై విరుచుకుపడ్డాడు. ఒక్కడే 120 మందిని హతమార్చి. వీరమరణం పొందాడు. ఆ రోజు చేతన్‌సింగ్ ఆ సాహసం చేయకపోతే.. భారతీయ భూబాగం చైనా వశమయ్యేది. ఆ తరువాత భారత ప్రభుత్వం వీరుడిని పరమవీరచక్ర పురస్కారం ప్రకటించింది. దసరా రోజున జీ తెలుగులో మెగాబ్రదర్ నాగబాబు సారథ్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నాగబాబు.. సైనికుల ధైర్యసాహసాలను వివరిస్తూ చెప్పిన వీరుడు చేతన్‌సింగ్ విజయగాథ. నిజంగానే.. భారతీయ సైనికుల సాహస గాథలు.. ఈ తరానికి స్పూర్తినింపుతాయి. చేతన్‌సింగ్ పుట్టిన రాజస్తాన్.. నేషనల్ వార్ మెమోరియల్ ఢిల్లీలోనూ విగ్రహాలు ఇప్పటి సైనికులకు ఎంతోధైర్యానిస్తున్నట్టుగా కనిపిస్తుంటాయి.