హీరోయిన్.. సినిమాలో ఎంత గొప్ప పాత్ర పోషించినా.. హీరో ముందు జూజూబీ. దర్శక, నిర్మాతలు కూడా జస్ట్ కథానాయికగానే భావించేవారు. కాలంతోపాటు.. కథానాయికలకు ఒక రోజు వస్తుందని తేలింది. మహానటి సావిత్రి, శారద, వాణిశ్రీ, కవిత, సిల్క్‌స్మిత, జయప్రద, జయసుద, శ్రీదేవి ఇలా ఎంతోమంది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్మురేపారు. కలెక్షన్ల సునామీతో నిర్మాతల పంటపండించారు. అప్పటి ప్రయోగాలు క్రమంగా హీరోయిన్లను సూపర్‌స్టార్‌లుగా మార్చాయి. విజయశాంతి ఏకంగా దక్షిణాధి అమితాబ్‌గా ఎదిగారంటే కేవలం హీరోయిన్ ఓరియెంటెడ్ గా ఆమె ప్రతిఘటన, కర్తవ్యం, ఓసే రాములమ్మ, వైజయంతి, లేడీబాస్, పోలీస్‌లాకప్ వంటి ఎన్నో హిట్లతో హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్‌తీసుకున్నారు. ఆ తరువాత రోజా, రమ్యకృష్ణ, వంటి వాళ్లు కూడా అన్నీతామై సినిమాలను హిట్ చేశారు.
ఆ తరువాత క్రమంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తగ్గుతూ వచ్చాయి. చానాళ్ల తరువాత అంటే.. ప్రస్తుత సినీ ప్రపంచంలో తమన్నా, జ్యోతిక, అనుష్క, కీర్తిసురేష్ , భూమిక ఇలా కొద్దిమంది తారామణులు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించారు. అక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. కొత్తగా వచ్చిన ఇమేజ్‌తో తమను తాము ఎక్కువగా ఊహించేసుకుని హీరోల సరసన నటిస్తే తమ క్రేజ్ తగ్గుతుందనే భావనకు వచ్చారు. అవే ప్రయోగాలు ఎంతగా హిట్ ఇచ్చాయో.. ఇప్పుడు అంతగా కిందకు నెట్టేస్తున్నాయి. చివరకు ఒంటరిగా మార్చేసి.. అవకాశాల కోసం వెతుక్కునే పరిస్థితికి చేర్చాయి.
మహానటి హిట్‌తో కీర్తిసురేష్ పెంగ్విన్ తీసినా బోల్తా కొట్టింది. అరుందతి తరువాత జేజమ్మ.. అనుష్క తనకు తిరుగులేదనుకుంది. పంచాక్షరితో అంతగా హిట్ కొట్టలేకపోయింది. సైజ్‌జీరో తరువాత మరింత డిమాండ్ పడిపోయింది. తమన్నా.. కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ తో కొన్ని హిట్లు అందుకుంది.. ఇప్పుడు అవకాశాల కోసం ఆశగా చూడాల్సివస్తోంది. చార్మి, త్రిష వంటి మూడు పదుల దాటిన హీరోయిన్ల పరిస్థితి.. దాదాపు ఇదే విధంగా ఉండటమే ఫాపం.. కథానాయికలకు కష్టంగా మారిందట. అప్పట్లో.. సావిత్రి, వాణిశ్రీ, జమున, బానుమతి, కాంచన వంటి వాళ్లు హీరోయిన్ ఓరియెంటెడ్‌గా సినిమాలతో హిట్ కొట్టినా.. హీరో సరసన మంచిపాత్ర కోసం పిలుపురాగానే ఇగోలు వదిలేసి నటించేవారు. ఇప్పటి తరం నటీమణుల్లో ఆ సర్దుబాటు తత్వం లేకపోవటం వల్లనే ఇటువంటి దుస్థితి అంటూ సినీవర్గాల్లో గుసగుసలు.



