తెలుగు సినిమా పెద్దమనసు..

హైదరాబాద్: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో నటులు చిరంజీవి, నాగార్జున భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో వరద బాధితుల కోసం రూ. కోటి చెక్‌ను చిరంజీవి, రూ.50 లక్షలు నాగార్జున స్వయంగా కేసీఆర్‌కు ఇచ్చారు. వీరితో పాటుగా మైహోమ్‌ గ్రూప్‌ తరపున సంస్థ డైరెక్టర్‌ రామ్‌ రూ.5 కోట్లు ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవాలని సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వరద బాధితుల సహాయం కోసం టాలీవుడ్ తారలు కదలివచ్చిన విషయం తెలిసిందే. మొదటగా నాగార్జున రూ. 50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వదర బాధితుల కోసం కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్ పలువురు సినీ దిగ్గజాలు సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు.NAGARJUNA

Previous articleదుబ్బాక‌లో అమెరికా లెక్క‌లు.. క‌మ‌లం తెగ ఖుషీ!
Next articleమెగాఫ్యాన్స్ కు చెర్రీ గ్రీన్ ఛాలెంజ్‌!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here