ఆసియాలో అత్యుత్త‌మ హోట‌ల్‌లో కొణిదెల వారి అమ్మాయి పెళ్లి!

మెగాఫ్యామిలీ ఇంట ఏ వేడుక జ‌రిగినా అభిమానుల‌కూ పండుగే. ఆహ్వానం అందినా అంద‌కున్నా.. త‌మ ఇంట జ‌రిగే శుభ‌కార్యం గానే భావిస్తుంటారు. అందుకే.. కొణిదెల వారి అమ్మాయి.. అదేనండీ నాగబాబు కూతురు నిహారిక‌, జొన్న‌ల గ‌డ్డ చైత‌న్య‌ల వివాహ వేడుక‌పై అంత‌టి ఆసక్తి ఉంది. డిసెంబ‌రు 9వ తేదీ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇంత‌కీ పెళ్లి ఎక్క‌డో తెలుసా.. రాజ‌స్తాన్‌లోని ఉద‌య్ పూర్ ఒబెరాయ్ ఉద‌య్ విలాస్ ప్యాలెస్ లో నిహారికి, చైత‌న్య వివాహం జ‌ర‌గ‌బోతుంద‌న్న‌మాట. డెస్టినేష‌న్ వెడ్డింగ్ కోసం అక్క‌డ ఏర్పాటు చేశార‌ట‌. ఇప్ప‌టికే ఈ కాబోయే వ‌ధూవ‌రులు వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం అక్క‌డ‌కు వెళ్తున్నార‌ట‌. ఇంత‌కీ.. ఉద‌య్ విలాస్ ప్యాలెస్ ప్ర‌త్యేక‌త ఏమిటంటారా.. ఆసియాతో అత్యుత్త‌మ హోట‌ల్‌. చాలా ఖరీదైన హోట‌ల్ కూడా.. అద్భుతంగా అనిపించేలా విలాస‌వంత‌మైన సౌక‌ర్యాలు.. అప‌ర కుబేరుల‌కే ప‌రిమిత‌మైన చోట కొణిదెల వారి వివాహ సంద‌డి ఏర్పాటు చేయ‌టం నిజంగానే విశేషం. ముఖేష్ అంబానీ కూతురు నిశా పెళ్లి సంగీత్ ఉత్స‌వం కూడా ఇక్క‌డే జ‌రిగింద‌న్న‌మాట‌.

Previous articleబీజేపీ దూకుడు.. ప‌క్కాగా 40 సీట్లు!
Next articleBharatPe Aims to scale up to 65 cities

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here