పవర్‌స్టార్ సినిమా అంటేనే విపరీతమైన క్రేజ్. కొత్త ప్రాజెక్టు వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుతుంటాయి. ఇప్పటికే వకీల్‌సాబ్ షూటింగ్ పూర్తిచేసుకోనుంది. ఆ తరువాత వరుసగా ఐదు సినిమాల్లో నటించేందుకు పవన్ కాల్షీట్లు ఇచ్చేశారు. వకీల్‌సాబ్ కాగానే.. దిగ్గజ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన ఎవరు నటిస్తారనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కీర్తిసురేష్ నుంచి కాజల్, శృతిహాసన్ ఇలా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. చివరిగా.. ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాల్లో వార్త చక్కర్లు కొడుతుంది. అదే నిజమైతే.. అమ్మడు భలే ఛాన్స్ కొట్టేసినట్టేనంటూ టాలీవుడ్ టాక్.



